
మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) తెలుగు, తమిళ, మలయాల సినిమాలు చేస్తూ ప్రస్తుతం బిజీబిజీగా గడుపుతోంది. ప్రభాస్తో (Prabhas) కలిసి నటించిన ‘ది రాజా సాబ్’ (The Raja Saab) మూవీ టీజర్ ఈమధ్య విడుదలవగా అందులో మాళవిక ప్రజెన్స్, లుక్స్, వొలకబోసిన గ్లామర్కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో మాలవిక తెగ సంబర పడుతున్నారు. ఈ క్రమంలోనే నెట్టింట్లో తన ఫాలోవర్లు, ఫ్యాన్స్, నెటిజన్లతో చిట్ చాట్ చేశారు. నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రస్తుతం తెలుగులో రాజా సాబ్ చేస్తున్నానని, తమిళంలో కార్తితో సర్దార్ 2, మలయాళంలో హృదయపూర్వం అనే సినిమా చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఈ క్రమంలో ఓ నెటిజన్ మాళవిక ముందు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టేశారు. ‘నన్ను పెళ్లి చేసుకుంటావా? బేబ్’ అంటూ ట్వీట్ వేశాడు. అయితే ఘోస్ట్ అనే పేరుతో ఉన్న ఈ నెటిజన్‌కి మాళవిక తెలివైన సమాధానం ఇచ్చింది. తనకు ఘోస్ట్‌లు అంటే చాలా భయమని చెప్పి.. నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పకనే చెప్పేసింది.
ప్రభాస్ నాకు అలా స్వాగతం పలికారు
రాజా సాబ్ సెట్‌లో జరిగిన ఫన్నీ ఇన్సిడెంట్ ఏదైనా ఉంటే చెప్పమని మాళవికని ఓ నెటిజన్ అడగ్గా.. మొదటి రోజు జరిగిన ఘటన గురించి మాళవిక చెప్పుకొచ్చారు. ‘రాజాసాబ్ మూవీకి నాకు అదే ఫస్ట్ డే షూట్. రాత్రంగా ట్రావెల్ చేసి వచ్చాను. ఫ్లైట్‌లో కూడా నిద్ర పోలేదు. ఆ రోజంతా షూట్ చేసి అలసిపోయి వచ్చా. పాలిపోయిన మొహం, డల్ ఫేస్‌తో సెట్‌లోకి సెట్‌లోకి అడుగుపెట్టా. కానీ ప్రభాస్ మాత్రం ఎంతో చార్మింగ్, అందంగా నాకు స్వాగతం పలికారు’ మాళవిక చెప్పుకొచ్చారు.