కొలీవుడ్ గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) తెలుగులోకి అడుగుపెడుతున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’(The Raja Saab). రెబల్ స్టార్ ప్రభాస్(Brabhas) హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.
ఈ చిత్రంలో మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ‘సలార్’, ‘కల్కి 2898 ఏ.డి.’ వంటి భారీ హిట్‌ల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘రాజా సాబ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇటీవల మాళవిక మోహనన్ ట్విటర్ వేదికగా #AskMalavika అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది. ఇందులో ఆమెకు వచ్చిన ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఓ నెటిజన్ “మీరు తదుపరి సినిమా ఏ డైరెక్టర్‌తో చేయాలనుకుంటున్నారు? ఎందుకు?” అని ప్రశ్నించగా, మాళవిక స్పందిస్తూ – “నా లిస్టులో చాలా మంది ఉన్నారు. కానీ రాజమౌళి సార్‌తో పని చేయాలనే కోరిక ఉంది” అని పేర్కొంది.
ఈ సమాధానాన్ని చూసిన నెటిజన్లు “ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుంది”, “మీ నటనకు అలా మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నాం” అంటూ రెస్పాన్స్ ఇస్తున్నారు.






