టాప్ డైరెక్టర్‌పై మాళవిక ఆసక్తికర వ్యాఖ్యలు… వైరల్ అవుతున్న కామెంట్స్!

కొలీవుడ్ గ్లామర్ బ్యూటీ మాళవిక మోహనన్(Malavika Mohanan) తెలుగులోకి అడుగుపెడుతున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’(The Raja Saab). రెబల్ స్టార్ ప్రభాస్(Brabhas) హీరోగా నటిస్తున్న ఈ భారీ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.

ఈ చిత్రంలో మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ‘సలార్’, ‘కల్కి 2898 ఏ.డి.’ వంటి భారీ హిట్‌ల తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో ‘రాజా సాబ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇటీవల మాళవిక మోహనన్ ట్విటర్ వేదికగా #AskMalavika అనే హ్యాష్‌ట్యాగ్‌తో అభిమానులతో చిట్‌చాట్ నిర్వహించింది. ఇందులో ఆమెకు వచ్చిన ఓ ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ నెటిజన్ “మీరు తదుపరి సినిమా ఏ డైరెక్టర్‌తో చేయాలనుకుంటున్నారు? ఎందుకు?” అని ప్రశ్నించగా, మాళవిక స్పందిస్తూ – “నా లిస్టులో చాలా మంది ఉన్నారు. కానీ రాజమౌళి సార్‌తో పని చేయాలనే కోరిక ఉంది” అని పేర్కొంది.

ఈ సమాధానాన్ని చూసిన నెటిజన్లు  “ఆ కోరిక త్వరలోనే నెరవేరుతుంది”, “మీ నటనకు అలా మంచి అవకాశం రావాలని కోరుకుంటున్నాం” అంటూ రెస్పాన్స్ ఇస్తున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *