నేటి సోషల్ మీడియా యుగంలో ఆరాటం అంతా లైకులు, వ్యూస్, షేర్ల కోసమే. వ్యూస్ కోసం ప్రాణాలు కూడా ఫణంగా పెట్టి వీడియోలు చేస్తున్నారు కొందరు. ఫేమస్ అవ్వాలని కొందరు.. పాపులారిటీ కోసం మరికొందరు.. క్రేజ్ కోసం ఇంకొందరు.. ఇలా నెట్టింట పేరు తెచ్చుకునేందుకు చావుతో చెలగాటమాడుతున్నారు. ప్రాణాలంటే లెెక్కచేయకుండా.. తల్లిదండ్రులను కూడా పట్టించుకోకుండా సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వాలని పిచ్చి చేష్టలు చేస్తున్నారు.
అరె ఎవడ్రా మీరంతా?
ఇలా పాపులారిటీ కోసం పాకులాడుతూ ప్రాణాలు ఫణంగా పెడుతున్న ఎన్నో ఘటనలు రోజూ మనం వార్తల్లో చూస్తున్నాం. అందులో కొందరు ప్రాణాలు కోల్పోతుంటే.. మరికొందరు జీవచ్ఛవాలుగా మారుతున్నారు. ఇంకొందరు కాళ్లూ చేతులు విరగ్గొట్టుకుని తల్లిదండ్రులకు దుఃఖం మిగుల్చుతున్నారు. తాజాగా నెట్టింట ఇలాంటి ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పాపులారిటీ కోసం ఏకంగా విద్యుత్ వైర్లపై పుష్-అప్స్ చేశాడు. ఈ వీడియో మీరు కూడా ఓసారి చూసేయండి.
చావుతో చెలగాటం ఆడిన వ్యక్తి…
ఓ వ్యక్తి ఎత్తైన కరెంట్ స్తంభాల పైకి ఎక్కి విద్యుత్ తీగలను పట్టుకుని పుష్-అప్లు చేస్తున్నాడు. తర్వాత స్తంభంపై కూర్చుని సేద తీరాడు. ఇంత ప్రమాకరంగా ఉంటే చావుని కొని తెచ్చుకోవడమే అంటూ నెటిజన్లు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతుంది. pic.twitter.com/BrhYd0OLAS
— ChotaNews App (@ChotaNewsApp) March 3, 2025
కరెంట్ తీగలతో పుష్-అప్స్
ఓ వ్యక్తి ఎత్తైన విద్యుత్ స్తంభంపైకి ఎక్కడం ఈ వీడియోలో చూడొచ్చు. అంతటితో ఆగకుండా కరెంట్ తీగలు పట్టుకుని పుష్-అప్స్ చేశాడు. ఆ తర్వాత స్తంభంపై కూర్చుని సేద తీరాడు. సాధారణంగా కరెంట్ స్తంభం వద్దకు వెళ్లాలంటేనే చాలా మంది జంకుతారు. అలాంటిది స్తంభం ఎక్కి ఏకంగా విద్యుత్ తీగలు పట్టుకుని పుష్ అప్స్ చేయడం చూసి నెటిజన్లు మండిపడుతున్నారు. చావుతో చెలగాటం అంటే ఇదేనేమోనంటూ ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో క్రేజ్ కోసం ఆ వ్యక్తి ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.






