ఈ ‘మ్యాన్ ఈటర్‌’ కనిపిస్తే కాల్చేయండి.. ఎందుకంటే?

పెద్దపులి.. దాని పేరు వింటేనే ఒంట్లో వణుకు మొదలవుతుంది. ఇంకా దాన్ని దగ్గర నుంచి చూస్తే పైపై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది అడవుల్లో ఉండే ఈ మృగం ఊర్లోకి వస్తే? రావడమే కాదు మనుషులు.. పెంపుడు జంతువులపై దాడి చేసి చంపేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రస్తుతం ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయి కేరళ రాష్ట్రంలో.. దీంతో ఓ పులిని కేరళ ప్రభుత్వం(Kerala Govt) తొలిసారిగా మ్యాన్ ఈటర్‌(Man Eater Tiger)గా ప్రకటించింది. అంతేకాదు అది కనపడితే కాల్చేయమంటూ ఆదేశాలూ జారీ చేసింది. ఇంతకీ కేరళ ప్రభుత్వం ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి గల కారణమేంటంటే…

అసలేం జరిగిందంటే?

ఇటీవల వయనాడ్‌(Wayanad) జిల్లాలో ఓ పులి ఊర్లలోకి వచ్చి మనుషులు, పెంపుడు జంతువులను టార్గెట్ చేస్తోంది. ఇటీవల వయనాడ్‌లోని మనంతవాడి సమీపంలోని కాఫీ తోట(Coffee plantation)లో పనిచేస్తున్న రాధ (45) అనే మహిళలపై ఇటీవల ఓ పెద్దపులి(Tiger) దాడి చేసి చంపేసింది.ఆ తరువాత ఆమె మృతదేహంలో కొంత భాగాన్ని తినేసినట్లు సమాచారం. ఈ ఘటన కేరళలో సంచలనం రేపింది. దీనిపై స్థానికంగానూ పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అది కంటపడితే వెంటనే చంపేయాలని ఆదేశాలు జారీ చేసింది. జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రి శశీంద్రన్‌(Minister Sashindran) ఈ ప్రకటన చేశారు.

Adivasi woman's death in Wayanad: Forest Dept to shoot man-eating tiger,  order issued - KERALA - GENERAL | Kerala Kaumudi Online

ఇదే మొదటిసారి

అంతేకాదు ఆ పులి జయసూర్య(Jayadurya) అనే అటవీ శాఖ అధికారిపైనా దాడి చేసింది. ఇలా వరుస దాడులకు పాల్పడుతుండటం వల్ల ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. దీంతో వారు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేసింది. CM పినరయి విజయన్ సూచన మేరకు అడ్వకేట్‌ జనరల్‌, ఇతర న్యాయ నిపుణుల సలహా అనంతరం ఆ పెద్దపులిని చంపేయాలని నిర్ణయానికి వచ్చినట్లు మంత్రి శశీంద్రన్‌ వెల్లడించారు. అయితే, ఓ పులిని మ్యాన్‌ఈటర్‌గా ప్రకటించడం కేరళ రాష్ట్రంలో ఇదే మొదటి సారి కావడం గమనార్హం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *