Mana Enadu : గత వారం రోజులుగా మంచు ఫ్యామిలీ వివాదం (Manchu Family Fight News) టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన విషయం తెలిసిందే. ఆస్తి వివాదాలు, దాడులు, కేసులు, పోలీసుల రంగ ప్రవేశం, బహిరంగ క్షమాపణలు, జనరేట్ లో పంచదారలు.. ఇలా ఎన్నో రకాల మలుపులు తిరిగింది ఈ వ్యవహారం. అయితే తాజాగా ఈ వ్యవహారంలో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. మంచు మనోజ్ (Manchu Manoj), ఆయన సతీమణి భూమ మౌనిక.. జనసేన పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆళ్లగడ్డలో మనోజ్-మౌనిక
ఈ వార్తలకు బలాన్ని చేకూరుస్తూ ఇవాళ (సోమవారం) ఈ దంపతులిద్దరూ ఏపీకి వెళ్లారు. అయితే వారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో .. మాజీ ఎమ్మెల్యే భూమా శోభ నాగిరెడ్డికి నివాళులు అర్పించేందుకు వచ్చారు. తన భర్త మనోజ్ తో కలిసి మౌనిక (Bhuma Moukina) తన తల్లికి నివాళులు అర్పించారు. శోభా నాగిరెడ్డి సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు. మొదట హైదరాబాద్ నుంచి పెద్ద కాన్వాయ్‌తో 40వ జాతీయ రహదారి మీదుగా ఆళ్లగడ్డ (Manchu Manoj Allagadda)కు చేరుకున్నారు. అయితే వీరు కేవలం శోభా నాగిరెడ్డికి నివాళులు అర్పించేందుకే వచ్చినట్లు సమాచారం.
జనసేనలో చేరాలని నిర్ణయం
మరోవైపు మంచు ఫ్యామిలీ వ్యవహారం రచ్చకెక్కడం.. మనోజ్ మీడియాను ఆశ్రయించడంతో ఆయనపై నెటిజన్లు సానుభూతి ప్రకటిస్తున్నారు. మోహన్ బాబు (Mohan Babu Vs Manoj) వ్యవహారశైలిపై కాస్త గుర్రుగా ఉన్నారు. ఈ క్రమంలో సినిమాలతో బిజీగా ఉన్న మనోజ్.. వ్యాపారంలో తీరిక లేకుండా ఉన్న మౌనిక.. త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఇద్దరు జనసేనలో చేరాలని నిర్ణయించినట్లు టాక్ వినిపిస్తోంది.
ఆళ్లగడ్డ నుంచే రాజకీయ ప్రస్థానం
ఈ విషయాన్ని ప్రకటించేందుకు ఈ దంపతులు ఆళ్లగడ్డకు వచ్చారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. శోభా నాగిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించిన అనంతరం మనోజ్-మౌనిక (Manchu Manoj Political Entry) భూమ ఫ్యామిలీ, ఆ కుటుంబ సన్నిహితులతో సమావేశమైనట్లు తెలిసింది. ఈ సమావేశం అనంతరం ఈ దంపతులు తమ రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. గత ఎన్నికల్లో మౌనిక సోదరి అఖిల ప్రియ ఆళ్లగడ్డ నుంచి టీడీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆళ్లగడ్డ నుంచే తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించాలని మనోజ్-మౌనిక భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.






