మంచు ఫ్యామిలీలో ఇటీవల వరుసగా గొడవలు జరిగిన విషయం తెలిసిందే. అవి కాస్త రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మంచు మోహన్ బాబు(mohanbabu).. ఆయన కొడుకులు విష్ణు(manchu vishnu), మనోజ్ (Manju manoj) మధ్య ఆస్తి తగాదాలు.. డబ్బుల పంపకాల విషయంలో గొడవలు జరుగుతున్నాయని చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే మంచు విష్ణు, మంచు మనోజ్ సోషల్ మీడియాలో పరోక్షంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
ఫ్యామిలీ గొడవలే కారణమా?
మంచు మనోజ్ పలు మార్లు సోషల్ మీడియా ద్వారా కన్నీటి పర్యంతం(crying) అయ్యాడు. తమ ఇంట్లో కొందరు వ్యక్తులు ఆధిపత్యం చెలాయిస్తూ.. ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా అని మీడియాకు సైతం పలుమార్లు వివరించాడు. ఈ గొడవల నేపథ్యంలో మంచు విష్ణు, మోహన్ బాబు, మంచు మనోజ్ మీద కేసులు సైతం నమోదయ్యాయి.
Manoj Manchu becomes emotional during the #Bhairavam trailer launch. pic.twitter.com/T8cwBoyXL9
— Whynot Cinemas (@whynotcinemass_) May 19, 2025
మంచు మనోజ్ కంటతడి
ఇదిలాఉండగా, తాజాగా మనోజ్ మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. మంచు మనోజ్ తన తాజా చిత్రం “భైరవం” ట్రైలర్ (Bhairavam Trailer) లాంచ్ కార్యక్రమంలో తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. గత కొద్ది రోజులుగా తన తండ్రి మోహన్ బాబు, అన్న మంచు విష్ణుతో ఆస్తి వివాదాలు, వ్యక్తిగత దూరం నేపథ్యంలో మనోజ్ ఈ కార్యక్రమంలో ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.
అభిమానుల ఆదరణ చూసి..
ఈ కార్యక్రమంలో తనపై ప్రదర్శించిన ఏవీని చూసి కన్నీటి పర్యంతమైన మనోజ్, తన కష్టకాలంలో ప్రేక్షకుల ఆదరణ, అభిమానుల ప్రేమే తనకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత తాను హీరోగా పూర్తిస్థాయి పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు ప్రేక్షకుల మద్దతు కావాలని కోరారు. కుటుంబంలో జరుగుతున్న పరిణామాలపై పరోక్షంగా స్పందిస్తూ, సొంత వాళ్లే దూరం పెట్టినా అభిమానులు తనను గుండెల్లో పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు.
మే30న భైరవం రిలీజ్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (bellaam Konda Srinivas), నారా రోహిత్ (Nararohit) లతో కలిసి మనోజ్ నటించిన మల్టీస్టారర్ చిత్రం “భైరవం”. మే 30న విడుదల కానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళ హిట్ “గరుడన్”కు రీమేక్ అని తెలుస్తోంది. కుటుంబ సమస్యల నడుమ మనోజ్ నటించిన ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.






