మీడియాకు మోహ‌న్ బాబు బహిరంగ క్షమాపణలు

Mana Enadu : టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు హాట్ టాపిక్స్ విపరీతంగా హల్ చల్ చేస్తున్నాయి. ఒకటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టయితే.. మరొకటి మంచు ఫ్యామిలీ వివాదం. మంచు మోహన్ బాబు (Mohan Babu), ఆయన చిన్న తనయుడు మంచు మనోజ్ (Manchu Manoj) మధ్య వివాదం ఇప్పుడు రచ్చకెక్కింది. ఈ క్రమంలో జరిగిన పరిణామాల్లో.. సీనియర్ న‌టుడు మోహ‌న్ బాబు మీడియాతో అనుచితంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. జర్నలిస్టుపై దాడి చేయగా అతడు గాయపడ్డాడు.

ఈ క్రమంలో మంచు మోహన్ బాబు (Mohan Babu Apology) తాజాగా బహిరంగ క్షమాపణలు తెలిపాడు. ఆయన దాడి ఘ‌ట‌న‌లో జ‌ర్న‌లిస్ట్‌కు తీవ్ర‌గాయాలు కాగా.. మోహ‌న్ బాబు క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి అంటూ జ‌ర్నలిస్ట్ సంఘాలు అన్నీ ధ‌ర్నాకు దిగాయి. ఈ నేపథ్యంలో యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌ను మోహన్ బాబు కలిశాడు. అత‌డికి బహిరంగ క్షమాపణలు తెలిపాడు. అనంత‌రం అత‌డి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి.. ఆయన కుటుంబసభ్యులకు సారీ చెప్పాడు. మెహ‌న్ బాబుతో పాటు మంచు విష్ణు కూడా జ‌ర్నలిస్ట్ రంజిత్‌ను క‌లిసి ప‌రామ‌ర్శించి ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.

హైదరాబాద్‌ (Hyderabad) జల్‌పల్లి (Jalpally)లో మోహన్ బాబు(Mohan Babu) నివాసం వద్ద ఈనెల 10న.. ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్, మౌనిక దంపతులు ప్రయత్నించగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోగా.. సెక్యూరిటీతో మనోజ్ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో కవరేజీ కోసం లోనికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దుర్భాషలాడుతూ.. ఓ జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మోహన్‌బాబుపై పహాడీ షరీఫ్ పోలీసులు 118 బీఎన్ఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

Related Posts

మళ్లీ భారత్‌లోకి టిక్‌టాక్? క్లారిటీ ఇచ్చిన కేంద్రం ప్రభుత్వం..

2020 గాల్వన్ లోయ ఘటన తర్వాత భారత్–చైనా మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం డేటా భద్రత, గోప్యతా సమస్యలను ప్రస్తావిస్తూ పలు చైనా యాప్‌లపై నిషేధం విధించింది. టిక్‌టాక్(TikTok), అలీ ఎక్స్‌ప్రెస్(ali Express), షీన్(Sheein) వంటి…

BIGG BOSS-S9: బుల్లితెర ప్రేక్షకులకు అదిరిపోయే న్యూస్.. వచ్చే నెల 7 బిగ్‌బాస్-9 షురూ

తెలుగు టెలివిజన్ రియాలిటీ షోలలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘బిగ్ బాస్(Bigg Boss) తెలుగు’ సీజన్ 9(BB-9) సెప్టెంబర్ 7 నుంచి ఆరంభం కానుంది. స్టార్ మా(Star Maa), జియో హాట్‌స్టార్‌(Jio Hotstar)లో ప్రసారం కానున్న ఈ షోను అక్కినేని నాగార్జున(Nagarjuna…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *