మంచి విష్ణు(Manchu Vishnu) హీరోగా తెరకెక్కుతున్న హిస్టారికల్ మూవీ కన్నప్ప(Kannappa). పలువురు స్టార్ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), మోహన్‌లాల్ (Mohanlal), అక్షయ్ కుమార్ (Akshay Kumar) తదితర స్టార్ హీరోలు కీలక పాత్రలు పోషించారు. తిన్నడుగా విష్ణు, రుద్ర పాత్రలో ప్రభాస్, శివుడిగా అక్షయ్‌కుమార్ నటించారు. ‘మహాభారతం(Mahabharatam)’ సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్‌సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 27న (Kannappa Release Date) రిలీజ్ కానుంది.

జేఆర్సీ కన్వెన్షన్‌లో కొనసాగుతున్న ప్రీరిలీజ్ ఈవెంట్
తాజాగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంటు(Pre release event)ను హైదరాబాద్‌లోని JRC కన్వెన్షన్లో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఈ సినిమాలో నటించి ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. ఇప్పటికే ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్ర బృందం తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ (Kannappa Movie Making) చేసింది. దాదాపు మూడు నిమిషాల నిడివితో రూపొందిన ఈ వీడియో ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ఈ వీడియోను మీరూ చూసేయండి..






