ప్రభాస్‌ను మొదటిసారి చూసిన క్షణం మర్చిపోలేను.. మాళవిక మోహనన్ కామెంట్స్ వైరల్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ ఫాంటసీ చిత్రం ‘ది రాజాసాబ్’ ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ మాళవిక మోహనన్(Malavika Mohanan), ప్రభాస్‌(Prabhas)తో తన తొలి ఇంటరాక్షన్ గురించి అభిమానులతో షేర్ చేసుకుంది.

తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించిన మాళవిక… “ప్రభాస్‌ గారిని ‘ది రాజాసాబ్’ సెట్స్‌లో మొదటిసారి కలిసిన క్షణం నాకు జీవితాంతం గుర్తుండిపోయే ప్రత్యేక అనుభవం. నేను అప్పట్లో ఓ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని, నిద్ర లేకుండా చాలా అలసిపోయి సెట్లోకి వచ్చాను. కానీ ప్రభాస్‌ను చూశాక నాలో అంతా మారిపోయింది. ఆయన్ని చూడగానే ఎనర్జీ ఉరకలేసింది” అంటూ భావోద్వేగంగా చెప్పింది.

అంతేకాకుండా ప్రభాస్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మాళవిక, “ఆయన చాలా చక్కగా పలకరిస్తారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అంతేకాదు, మంచి హ్యూమన్ బీయం మాత్రమే కాదు, కమ్యూనికేషన్‌లోనూ గొప్పతనం ఉంది” అంటూ తెలిపింది.

‘ది రాజాసాబ్’ సినిమాకు సంబంధించి ఇది ఒక హారర్ ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ చిత్రం. ఇందులో మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. కథకు అనుగుణంగా, చిత్ర యూనిట్ అత్యంత విశాలంగా ఒక పురాతన భవంతి సెటప్‌ను నిర్మించి మిస్టీరియస్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు.

ఇటీవల విడుదలైన టీజర్‌లో ప్రభాస్ రెండు విభిన్న గెటప్పుల్లో దర్శనమిచ్చాడు – ఒకటి చలాకీగా, స్క్రీన్‌ను డామినేట్ చేసే విధంగా; మరొకటి అతీంద్రియ శక్తులున్న పాత్రగా. ఈ కాంబినేషన్‌ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు క్రియేట్ చేసింది.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, సినిమాటోగ్రఫీని కార్తీక్ పళని అందిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్ 5, 2025న పాన్-ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.

 

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *