మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన మూవీ ‘కన్నప్ప’ (Kannappa). రెబల్ స్టార్ ప్రభాస్, మోహన్‌లాల్, అక్షయ్‌కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబు ఇలా భారీ తారాగణం నటించిన ఈ చిత్రం త్వరలోనే థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రమోషన్లో విష్ణు బిజీగా గడుపుతున్నారు. కొన్ని రోజులుగా వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ డైరెక్షన్పై ఆసక్తికర కామెంట్స్ చేశారు.
అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా నటించారు..
తాను డైరెక్షన్ చేస్తే అమితాబ్‌ను (Amitabh Bachchan) డైరెక్ట్ చేస్తానని మంచు విష్ణు అన్నారు. ఓ ఇంటర్వ్యూలో మీరు డైరెక్షన్ వైపు వెళ్తారా అని వ్యాఖ్యాత ప్రశ్నించగా విష్ణు సమాధానమిచ్చారు. ‘‘నేను దర్శకత్వం వహిస్తే.. అమితాబ్ సినిమాకు డైరెక్టర్‌గా వర్క్ చేస్తా. అది నా కల. భారతీయులంతా ఆయన పనిని ఇష్టపడతారు. గతేడాది వచ్చిన ‘కల్కి’లో ఆయన అశ్వత్థామ పాత్రలో అద్భుతంగా నటించారు. ఆ పాత్ర, ఆయన నటన నాకు చాలా నచ్చింది’’ అని పేర్కొన్నారు.
ఈ నెల 27న రిలీజ్
అన్ని హంగులతో రూపొందిన ‘కన్నప్ప’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మొత్తం 195 నిమిషాలతో ఈ చిత్రం రూపొందగా.. సెన్సార్ బోర్డు 12 కట్స్ చెప్పింది. ఆ మేరకు చిత్ర బృందం మార్పులు చేసింది. 182 నిమిషాల (3 గంటల 2 నిమిషాలు) రన్‌టైమ్ రిలీజ్కు సిద్ధమైంది.






