ప్రముఖ వాహన తయారీ సంస్థ అయిన మారుతీ సుజుకీ(Maruti Suzuki) ఇప్పటివరకు తమ బ్రాండ్‌కు చెందిన 30 లక్షల కార్లను(30 lakh cars from India) వివిధ దేశాలకు ఎగుమతి చేసింది. 2031 సంవత్సరం నాటికి విదేశాలకు ఏటా 7.5 లక్షల కార్లను సరఫరా చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ప్రయాణికుల వాహనాల్లో 40-50% వాటా తమ సంస్థదే అని మారుతీ సుజుకీ ఎండీ, సీఈవో హిసాషి టెకూచీ(Maruti Suzuki MD CEO Hisashi Takeuchi) తెలిపారు. మేక్ ఇన్ ఇండియా(Make in India) చొరవతో ఎగుమతులను రెట్టింపు చేస్తామన్నారు.
26 ఏళ్లలో 10 లక్షల యూనిట్లు
ఇదిలా ఉండగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి 1.8 యూనిట్ల కార్లను ఎగుమతి చేసిన మారుతీ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో 2.83 లక్షల కార్లను వివిధ దేశాలకు సరఫరా చేసింది. 1986 నుంచి భారత్(India)లో తయారైన కార్లను విదేశాలకు సరఫరా చేస్తున్న ఈ కంపెనీ తొలి 10 లక్షల యూనిట్ల మార్కును 26 ఏళ్లలో సాధించింది. 10 లక్షల నుంచి 20 లక్షల మైలురాయిని 2021లో అందుకుంది. ఇక 30 లక్షల యూనిట్ల మైలురాయి(milestone)ని కేవలం 45 నెలల్లోనే సాధించింది.
కలిసొచ్చిన పండగ సీజన్
అక్టోబర్ నెలలో పండుగ సీజన్(Festival season) కావడంతో భారీగా కార్ల అమ్మకాలు జరిగాయి. కంపెనీలు పండగ చేసుకున్నాయి. అక్టోబర్ 2024 నెల అమ్మకాల గణాంకాల్లో మారుతి సుజుకి టాప్ గెయినర్(Top gainer)లలో ఒకటిగా ఉంది. అక్టోబర్ 2023లో విక్రయించిన 1,99,217 యూనిట్లతో పోల్చితే ఇది సంవత్సరానికి 3.62 శాతం వృద్ధిగా ఉంది. కంపెనీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశీయ విక్రయాలు భారీగా ఉన్నాయి. అక్టోబర్ 2024లో దేశీయంగా మొత్తం 163,130 యూనిట్లు అమ్మకాలు జరిగాయి.