ప్రస్తుతం ప్రతి ఒక్కరి జేబులో పర్స్ ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డు(Credit Card) మాత్రం తప్పకుండా ఉంటుంది. బ్యాంకు(Banks)లు, ఫైనాన్స్ సంస్థలు(Finance institutions) కాల్స్ చేసి మరీ క్రెడిట్ కార్డులు జనాలకు అంటగడుతున్నాయి. జీరో కన్వీయన్స్ ఫీజు, జీరో అన్యువల్ ఫీజు అంటూ, ఆ ఆఫర్లు, ఈ ఆఫర్లు(Offers) అంటూ వినియోగదారులకు క్రెడిట్ కార్డులు అందిస్తున్నాయి. దీంతో ఏ సమయం ఎలా వస్తుందో.. అని దాదాపు ప్రతి ఒక్కరూ వీటిని తీసుకుంటున్నారు. అవసరానికి డబ్బు చేతిలో లేకపోయినా క్రెడిట్ కార్డుల సాయంతో అప్పటికప్పుడు పరిస్థితిని దాటించుకోవచ్చే ధోరణీ వినియోగదారులలో పెరిగింది. దీంతో వీటికి ప్రాధాన్యం ఎక్కువైపోయింది. మరి ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో మనకు అండగా నిలిచే ఈ క్రెడిట్ కార్డు కేవలం మన అవసరాలను తీర్చడం మాత్రమే కాకుండా.. కొన్ని ఉచిత ఇన్సూరెన్స్(Free insurance)లను కూడా అందిస్తాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
* అత్యవసర పరిస్థితుల్లో ఇలా ఉపయోగపడతాయి
➤ కొన్నిసార్లు మనం ప్లాన్ చేసుకున్న టూర్(Tour) రద్దు చేసుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ ఇన్సూరెన్స్ కవరేజీ(Insurance coverage) లభిస్తుంది. ప్రయాణం ఆలస్యమైనప్పుడు వసతి, భోజనం, రవాణా వంటి ఖర్చులకు సైతం కవరేజీ లభిస్తుంది. ప్రయాణ సమయంలో మన వస్తువులను ఎవరైనా దొంగిలించినా, డ్యామేజీ జరిగినా బీమా కవరేజీ ఉంటుంది. విదేశాల్లో మనం అనారోగ్యానికి గురైనా, ఏదైనా ప్రమాదం జరిగినా.. వైద్య ఖర్చుల(For medical expenses)కు కూడా బీమా కవరేజీ వర్తిస్తుంది.
➤ క్రెడిట్ కార్డు(Credit card) ద్వారా మనం ఏదైనా వస్తువు కొనుగోలు చేసినప్పుడు అది నిర్దిష్ట వ్యవధిలోపు దొంగతనానికి గురైతే దానికి బీమా కవరేజీ లభిస్తుంది. పాడైన వస్తువుకు కూడా బీమా కవరేజీ ఉంటుంది.
➤ కొన్ని ఎంపిక చేసిన వస్తువులపై వారంటీని క్రెడిట్ కార్డు ఒకటి నుంచి రెండేళ్లపాటు పొడిగిస్తుంది.
➤ క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్లు చేసిన కొన్ని వస్తువులను నిర్దిష్ట వ్యవధిలోపు తిరిగి ఇచ్చేందుకు అవకాశం లభిస్తుంది.
➤ క్రెడిట్ కార్డు ఉపయోగించి మొబైల్ ఫోన్ కొనుగోలు(Purchase of mobile phone) చేస్తే అది డ్యామెజ్ అయినా, దొంగతనానికి గురైన ఆ నష్టాన్ని బీమా కవర్ చేస్తుంది.
➤ క్రెడిట్ కార్డు ద్వారా ఏదైనా మోసం జరిగినప్పుడు వినియోగదారుడిపై భారం పడకుండా ఆ నగదును ఈ బీమా ద్వారా పొందవచ్చు.
➤ క్రెడిట్ కార్డు హోల్డర్ మరణించినట్లయితే ఆ భారం కుటుంబసభ్యులపై పడుతుంది. అయితే, కార్డు హోల్డర్ పరిమితి మేరకే క్రెడిట్ వాడుకుంటే దాన్ని ఈ ఇన్సూరెన్స్ కవరేజీ ద్వారా తీర్చేయవచ్చు.
➤ కొన్ని క్రెడిట్ కార్డులు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ప్రమాద బీమా కవరేజీ(Accidental insurance coverage)ని అందిస్తాయి.
Tags: Credit Cards, Credit Card Offers, Credit Card Insurance Coverage, Credit Card Insurance Benefits, Credit Card Insurance Features & Benefits, Free insurance, Banks