మైనంపల్లి పాదయాత్ర..కమలం కోసమేనా..?

 

మంత్రి హరీష్​రావుపై సంచలన వ్యాఖ్యలు చేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో హట్​ టాఫిక్​గా మారారు. సీఎం కేసీఆర్​ ప్రకటించిన జాబితాలో మల్కాజిగిరి టిక్కెట్​ మైనంపల్లికే కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. కానీ కవిత, కేటీఆర్​, హరీష్​రావు ఒత్తిడితో అభ్యర్థి మార్పులో అనివార్యమైంది. మెదక్​ సీటును తన కుమారుడు రోహిత్​ను రంగంలోకి దింపాలని అనుకున్నారు. కానీ బీఆర్​ఎస్​ సీటు రాకుండా మంత్రి హరీష్​రావు అడ్డుకున్నారని విమర్శలు చేసిన విషయం తెలిసిందే..

మల్కాజిగిరి ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. భవిష్యత్తు కార్యాచరణలో వారం రోజుల్లో ప్రకటిస్తానని చెప్పారు. ప్రజల్లోనే ఉంటాను ప్రజల కోసం పనిచేస్తానని అన్నారు. కానీ రోహిత్​కి మెదక్​లో టిక్కెట్​ ఇచ్చేందుకు ఓ జాతీయపార్టీ ముందుకొచ్చిందని రాజకీయవర్గాల్లో వినిపిస్తుంది.

బీజేపీ హమీతోనే పాదయాత్రకు సిద్దం..?

మల్కాజిగిరిలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు పాదయాత్ర చేసేందుకు సిద్దం అయ్యారు. ఓ వైపు కాంగ్రెస్​ పార్టీ నుంచి పిలుపు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ రెండు చోట్ల టిక్కెట్​ ఇచ్చేందుకు బీజేపీ మొగ్గు చూపించినట్లు తెలుస్తుంది. మల్కాజిగిరి టిక్కెట్​ ఇచ్చేందుకు పార్టీ పెద్దలు  క్లారీటీ ఇచ్చారని సమాచారం.

బీఆర్​ఎస్​ నాయకులు ఎదురుదాడి

మరోవైపు బీఆర్​ఎస్​ నాయకులు మైనంపల్లి మంత్రి హరీష్​రావుపై చేసిన వ్యాఖ్యలపై నిరసనలు చేస్తున్నారు. మరోవైపు మైనంపల్లి అనుచరులు బీఆర్​ఎస్​ నాయకులపై సోషల్​ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. గ్రేటర్​ హైదరాబాద్​లో ఇప్పటికే 50డివిజన్లలో బీజేపీ సత్తా చాటింది. ఈక్రమంలోనే మహనగరంలో ఈసారి కారుకే కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కమలం…కాంగ్రెస్​ మధ్యనే పోటీ ఉండబోతుందనేది స్పష్టంగా చెబుతున్నారు.

 

Share post:

లేటెస్ట్