యంగ్ మాస్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen), న్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి(Ravi Teja Mullapudi) కాంబో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘మెకానిక్ రాకీ(Mechanic Rocky)’. ఈ మూవీలో విశ్వక్ సరసన మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary), శ్రద్దా శ్రీనాథ్(Shraddha Srinath)లుగా కథనాయికలు నటిస్తున్నారు. ఈ మూవీని SRT ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మించారు. కాగా ఈనెల 22న (నవంబర్ 22న) ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్స్ సైతం మేకర్స్ ఓ రేంజ్లో నిర్వహించారు. తాజాగా వరంగల్‌లో ‘మెకానిక్ రాకీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre-release event) నిర్వహించారు. ఇది వరకే ట్రైలర్-1.0 రిలీజ్ చేయగా.. నిన్న ట్రైలర్ 2.0ని లాంచ్ చేశారు. ఓరుగల్లు(Warangal) అభిమానులు భారీగా తరలివచ్చారు.
నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం అభిమానులే: విశ్వక్
ఇక ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో విశ్వక్ మాట్లాడారు. “ఇంత గ్రాండ్ వెల్కమ్ ఇచ్చిన వరంగల్ ఫ్యాన్స్(Warangal Fans) అందరికీ థాంక్యూ సో మచ్. మేం చాలా కష్టపడి సినిమా తీసి ప్రమోట్ చేసుకుంటున్నాం. క్రిటిక్స్, రివ్యూవర్స్ సినిమా గురించి ఏం రాసినా.. ఏం కామెంట్ చేసినా పర్వాలేదు. కానీ పర్సనల్ లెవెల్(Personal level)లో ఎటాక్ చేయకూడదని కోరుతున్నా. క్రిటిక్స్, రివ్యూస్ మాకు మంచి సినిమా చేయడానికి ఒక మోటివేషన్. అభిమానులను ఇంప్రెస్ చేయడం మా పని. ఈ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయిన మళ్లీ సినిమా తీస్తా. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కారణం ప్రేక్షకులే. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్. జైహింద్” అంటూ విశ్వక్ ముగించాడు.

అభిమానులు ప్రేమకు హీరోయిన్లు ఫిదా
అలాగే తెలంగాణ ఎంపీ కడియం కావ్య(Telangana MP Kadyam Kavya) మాట్లాడుతూ..”మెకానిక్ రాకీ ట్రైలర్ 2.o అదిరిపోయింది. విశ్వక్సేన్ ఇచ్చి పడేసిండు. మెకానిక్ రాకీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్ అని అన్నారు. ఇక వరంగల్ అభిమానులు తమ పట్ల చూపించిన ప్రేమకు ఫిదా అయినట్లు హీరోయిన మీనాక్షి చౌదరి చెప్పారు. ఫస్ట్ ట్రైలర్ కు మంచి స్పందన వచ్చిందన్న ఆమె, రెండో ట్రైలర్ కూడా నచ్చుతుందన్నారు. ఈ సినిమాను అందరూ థియేటర్లలో చూడాలని మరో హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ కోరారు. కాగా ఈమూవీ ప్రమోషన్ల(Promotions)లో భాగంగా 18న తిరుమల దర్శనం, కాలేజీ విజిట్, 19న గోల్డెన్ ప్రెస్ పార్టీ, 20న ప్రీరిలీజ్ ఈవెంట్ 3.0, 21న AMB రెడ్ కార్పెట్ ప్రీమియర్లను వేయనున్నారు.






