మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వశిష్ఠ దర్శకత్వంలో సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర (Vishwambhara)’ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం స్పీడుగా షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు గ్రాఫిక్ వర్క్స్ కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. వీలైతే ఈ సినిమాను సమ్మర్ లేదా.. ఆగస్టులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మూవీ తర్వాత మెగాస్టార్ అనిల్ రావిపూడితో ఓ సినిమా.. శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela)తో మరో చిత్రం చేయనున్న విషయం తెలిసిందే.
చిరు-అనిల్ స్క్రిప్టు రెడీ
అయితే అనిల్ రావిపూడి (Anil Ravipudi) చిరంజీవి సినిమాకు యమా స్పీడులో పనులు చేస్తున్నారట. ఇప్పటికే వైజాగ్ లో తన టీమ్ తో కలిసి స్క్రిప్ట్ వర్క్, డైలాగ్స్ వర్క్ కంప్లీట్ చేశాడట. ఫస్టాఫ్ స్క్రిప్టు మొత్తం క్లియర్ గా లాక్ చేశాడట. ఇక త్వరలోనే హైదరాబాద్ లో సెకండాఫ్ స్క్రిప్టు పని కూడా పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట. మరోవైపు ఈ చిత్రానికి మ్యూజిక్ కూడా వాయించడం అప్పుడే మొదలెట్టేసినట్లు టాక్.
భీమ్స్ అదిరిపోయే ట్యూన్స్
ఈ సంక్రాంతి పండుగకు ‘సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam)’ అనే సినిమాతో థియేటర్కు వచ్చి రూ.300 కోట్ల వసూళ్లు రాబట్టి సూపర్ హిట్ కొట్టాడు అనిల్ రావిపూడి. ఈ చిత్ర విజయంలో మ్యూజిక్ కూడా ఓ భాగమే. ఆ సినిమాకు భీమ్స్ సిసిరోలియో (Bheems Ceciroleo) మ్యూజిక్ అందించాడు. ఇక చిరంజీవితో అనిల్ చేయబోయే చిత్రానికి కూడా భీమ్స్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా సెలెక్ట్ చేసుకున్నాడు అనిల్. మెగాస్టార్ కోసం భీమ్స్ అదిరిపోయే ట్యూన్స్ కూడా రెడీ చేశాడట.
మెగా స్పీడులో పనులు
మెగాస్టార్ సెట్ లో అడుగుపెట్టేసరికి మిగతా పనులన్నీ వేగంగా కంప్లీట్ చేస్తున్నాడట డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక సమ్మర్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. 2026 సంక్రాంతి రేసులో చిరంజీవి (Chiranjeevi Anil Film) సినిమాతో మరోసారి హిట్ కొట్టాలని అనిల్ గట్టిగా ట్రై చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్నారు. మరి మెగా స్పీడులో పని చేస్తున్న అనిల్ రావిపూడి చిరంజీవి సినిమాతో వెండితెరపై ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.






