మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. MEGA157 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇక ఇందులో చిరుతో పాటు విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కూడా తెర పంచుకోనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దాదాపుగా ఇది ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఇద్దరు భామలతో చిరు
ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఇందులో ఇద్దరు హీరోయిన్లు (MEGA 157 Heroine) నటించనున్నట్లు తెలిసింది. కామెడీ ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవికి జోడీగా ఇద్దరు నాయికలు కనిపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక సీనియర్ హీరోయిన్ తో పాటు యంగ్ నటిని రంగంలోకి దించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ఈ ఇద్దరు ఎవరో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వార్త రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
What better way to introduce our team to the legendary Megastar @KChiruTweets Garu than by paying tribute to his timeless dialogues 😍❤️🔥
Let’s celebrate MEGASTAR in his forte in #Mega157 🥳
SANKRANTHI 2026 – రఫ్ఫాడిద్దాం 😎#ChiruAnil @sahugarapati7… pic.twitter.com/xGhSLaIstr
— Anil Ravipudi (@AnilRavipudi) April 1, 2025
మే రెండో వారంలో సెట్లోకి చిరు
మరోవైపు మెగా157 సినిమా ఇప్పుడు రెగ్యులర్ షూటింగుకు రెడీ అవుతోంది. మే మూడో వారం నుంచి చిరు ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ చిత్ర తొలి షెడ్యూల్ హైదరాబాద్‌లోనే మొదలు కానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి తగ్గట్లుగా ఇప్పటికే పూర్వ నిర్మాణ పనుల్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో (bheems ceciroleo) మ్యూజిక్ అందిస్తున్నారు. సమీర్ రెడ్డి ఛాయా గ్రాహకుడిగా వ్యవహరించనున్నారు.






