చిరు-అనిల్ మూవీ అప్డేట్.. మెగాస్టార్ కోసం ఇద్దరు భామలు!

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబోలో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. MEGA157 వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇక ఇందులో చిరుతో పాటు విక్టరీ వెంకటేశ్ (Venkatesh) కూడా తెర పంచుకోనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దాదాపుగా ఇది ఖరారైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Image

ఇద్దరు భామలతో చిరు

ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్డేట్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే ఇందులో ఇద్దరు హీరోయిన్లు (MEGA 157 Heroine) నటించనున్నట్లు తెలిసింది. కామెడీ ప్రధానంగా సాగే ఈ ఫ్యామిలీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవికి జోడీగా ఇద్దరు నాయికలు కనిపించనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఒక సీనియర్‌ హీరోయిన్ తో పాటు యంగ్ నటిని రంగంలోకి దించనున్నట్లు సినీ వర్గాల సమాచారం. అయితే ఈ ఇద్దరు ఎవరో మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి వార్త రాలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

మే రెండో వారంలో సెట్లోకి చిరు

మరోవైపు మెగా157 సినిమా ఇప్పుడు రెగ్యులర్‌ షూటింగుకు రెడీ అవుతోంది. మే మూడో వారం నుంచి  చిరు ఈ సినిమా షూటింగులో పాల్గొననున్నట్లు తెలిసింది. ఈ చిత్ర తొలి షెడ్యూల్‌ హైదరాబాద్‌లోనే మొదలు  కానున్నట్లు టాలీవుడ్ వర్గాల సమాచారం. దీనికి తగ్గట్లుగా ఇప్పటికే పూర్వ నిర్మాణ పనుల్లో స్పీడ్ పెంచింది చిత్రబృందం. ఈ చిత్రానికి భీమ్స్‌ సిసిరోలియో (bheems ceciroleo) మ్యూజిక్ అందిస్తున్నారు. సమీర్‌ రెడ్డి ఛాయా గ్రాహకుడిగా వ్యవహరించనున్నారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *