మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆయన యువ దర్శకుడు వశిష్ట డైరెక్షన్లో విశ్వంబర మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తయినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తున్నట్లు సమాచారం.
కాగా ఆయన తర్వాతి చిత్రం అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో ఉంటుందని, షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహూ గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ మూవీ నెట్స్ పైకి వెళుతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి నాని(Nani) ప్రొడక్షన్లో దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో ఓ సినిమాకు పచ్చ జెండా ఊపారు. వీరు ముగ్గురు కలిపి దిగిన ఫోటో ఈమధ్య సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. మాస్ ఎలిమెంట్స్ తో కూడిన యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండనున్నట్లు సమాచారం.
వాటితో పాటు ఆనిమల్ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) సినిమాలు ఎంత వైలెంట్ గా ఉంటాయో మనందరికీ తెలిసిందే. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, ఆనిమల్ చిత్రాలతో ఆయన దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తీస్తున్న స్పిరిట్(Spirit) సినిమా స్క్రిప్ట్ పనుల్లో సందీప్ రెడ్డి వంగ ఉన్నారు. ఆ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబోలో సినిమాపై అభిమానులు అప్పుడే రికార్డ్స్ బద్దలు కొట్టే సినిమా రాబోతుందని కామెంట్లు చేస్తున్నారు. గతంలో డైరక్టర్ సందీప్ రెడ్డి వంగ ఓ ఇంటర్వూలో చిరీంజీవి యాక్టింగ్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మాష్టారు సినిమాలో చిరంజీవి హీరోయిన్ సాక్షి శివానంద్ మధ్య సన్నివేశంలో మెగస్టార్ చిరంజీవి సిగరేట్ చాలా ఇంటెన్సివ్ గా తాగే విధానం గురించి, మెగాస్టార్ వేసుకున్న షర్ట్ కలర్ తో సహా సందీప్ రెడ్డి ఆ ఇంటర్వూలో చెప్పకొచ్చారు. అంతలా చిరంజీవ్ ఫ్యాన్ అని చెప్పుకునే సందీప్ తో సినిమా పడితే బాక్సాఫీస్ బద్దలవుతుందని అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు చేస్తున్నారు.






