లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటి సాయిపల్లవి (Sai Pallavi) ప్రస్తుతం నాగ చైతన్య (naga chaitanya) కు జోడీగా తండేల్ మూవీలో నటిస్తుంది. గతంలోనూ వీరికి మంచి హిట్ ట్రాక్ ఉంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు చందు మెండేటి డైరెక్షన్ లో పాన్ ఇండియా తరహాలో తండేల్ మూవీ తెరెక్కుతుంది. శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ లో ఓ ఫిషర్ మెన్ రియల్ లవ్ స్టోరీతో ఈ సినిమా రెడీ అవుతుందని చిత్ర యూనిట్ తెలిపింది.అయితే నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సాయి పల్లవి హవా నడుస్తుంది. ఈ మధ్యే రిలీజ్ అయిన అమరన్(Amaran) మూవీ సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. తండేల్ (tandel) సినిమా కూడా హిట్ కావడం పక్కా అని అనుకుంటున్నారు. మరోవైపు బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ (ameer khan) తనయుడు జునైద్ ఖాన్ తో చేస్తున్న మూవీ కూడా చివరి దశకు వచ్చింది. అలాగా రామాయణం సినిమాలో సీతా దేవిగా సాయిపల్లవి కనిపించనుంది.
క్యారెక్టర్ ప్రాముఖ్యాన్ని బట్టే ఎంపిక
సాయి పల్లవి ఏ మూవీ చేసిన కథలో తన పాత్ర ప్రాముఖ్యతను తెలుసుకున్న తరువాతే స్రిప్టుకు ఓకే చెప్తుతుందని టాక్. అలాగా సినిమా చిత్రీకరణ సమయంలో యాక్షన్ చేసిన తరువాత మానిటర్ చూసికొని పెర్మాఫెన్స్ సరిగా రాకపోతే మళ్లీ రీటేక్ చేస్తుందంట. అయితే ఇదే విషయాన్ని అమెజాన్ ప్రైమ్ లో( amezon prime) స్ట్రీమ్ అవుతున్న ది రానా దగ్గుబాటి షోలో నాగ చైతన్య(Naga Chaitanya) రివీల్ చేశాడు. ఇది సెలెబ్రిటీ టాక్ షోనే అయినా రానా(Rana) తనదైన శైలిలో ప్రశ్నలు అడుగుతూ యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా షోను నడిపిస్తున్నాడు. అందుకు ఈ టాక్ షోకు మంచి ఆదరణ లభిస్తుంది. ఈ షోలో థర్డ్ ఎపిసోడ్ చైతన్య, రానా భార్య మిహీకాతో జరిగింది. ఇందులో ఆసక్తికర అంశాలు మాట్లాడుకుంటున్నారు. సాయి పల్లవికి రానా ఫోన్ చేసి కాసేపు సరదాగా ఆడుకున్నారు.
ఎడిటింగ్ లో తల దూర్చను
సాయిపల్లవి యాక్ట్ చేసేటపుడు ఏ సీన్ అయినా దగ్గరుండి చెక్ చేసుకుంటుందని సరిగ్గా రాకపోతే రీ షూట్ అడుగుతుందనే టాక్ ఉంది. దాని గురించి ఫోన్ లో రానా (rana) అడిగితే.. అదేం లేదని, వాళ్లే తనను పిలుస్తారు కాబట్టి చూస్తాను.. అంతే తప్పా ఎడిటింగ్ లో తలదూర్చనని క్లారిటీ ఇచ్చింది. మరో పక్క చైతన్య మాట్లాడుతూ తన పని కూడా సాయిపల్లవే చూసుకుంటుందని, కట్ చెప్పిన తరువాత వెంటనే మానిటర్ దగ్గరకు వెళ్లి సరిగ్గా వచ్చిందో లేదో చూస్తుందని.. అలాంటప్పుడు టెన్షన్ పడాల్సిన పనిలేదని అన్నాడు.






