జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ (Janasena Formation Day)లో ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పవర్ స్టార్ అభిమానులు, జనసేన కార్యకర్తలు ఈ ప్రసంగాన్ని నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ఇక పవన్ మాట్లాడిన తీరుపై ఆయన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా స్పందించారు. ఈ సందర్భంగా తన తమ్ముడి స్పీచ్ ను ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?
My dear brother @PawanKalyan
జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి
మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష
జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది.
ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో
నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని…— Chiranjeevi Konidela (@KChiruTweets) March 14, 2025
పవన్ స్పీచ్ అదరగొట్టావ్
‘‘మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్.. జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ మైండ్ బ్లోయింగ్. సభకు వచ్చిన జనంలానే నీ మాటలు విన్న నా మనసు ఉప్పొంగిపోయింది. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడు వచ్చాడన్న నమ్మకం నాకు మరింత బలపడింది. ప్రజాసంక్షేమం కోసం నువ్వు చేసే జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. నీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. జన సైనికులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అంటూ చిరంజీవి (Chiranjeevi Post) తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Live example of Guts unna Leader ✊🏻🔥#JanaSena12thFormationDay #PawanKalyan pic.twitter.com/8XdqXmfEFX
— 🦅 Rishi 🦁 (@PKCult__DHFM) March 14, 2025
అంతా దేవుడి దయ
జనసేన ఆవిర్భావ సభ శుక్రవారం రోజున పిఠాపురంలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సభా వేదికగా పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. పదకొండేళ్ల జనసేన ప్రస్థానాన్ని, ఎన్నో కష్టాలు ఎదుర్కొని పార్టీని ఎలా నిలబెట్టగలిగారో ఆయన వివరించారు. కోట్ల మందికి సంబంధించిన రాజకీయాల్లోకి వచ్చానంటే అది భగవంతుడి దయేనని ఆయన తెలిపారు. తనను ఆదరిస్తున్న ఇతర నటీనటుల అభిమానులకు.. కార్యకర్తలకు.. ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.






