మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 70వ పుట్టినరోజు (ఆగస్టు 22) సందర్భంగా మెగా ఫ్యాన్స్ కోసం ఒకరోజు ముందుగానే అదిరిపోయే కానుక అందింది. చిరంజీవి హీరోగా నటిస్తున్న భారీ చిత్రం ‘విశ్వంభర’ టీజర్(Vishvambhara Teaser)ను ప్రముఖ నిర్మాణ సంస్థ UV క్రియేషన్స్ విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియా(Social Media)లో సినీ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక నిమిషం 14 సెకన్ల నిడివితో ఉన్న ఈ టీజర్, అద్భుతమైన విజువల్స్‌తో సినిమాపై అంచనాలను భారీగా పెంచింది. ఇదొక సోషియో-ఫాంటసీ చిత్రమని టీజర్ స్పష్టం చేస్తోంది.
వచ్చే సమ్మర్ హాలిడేస్‌లో గ్రాండ్ రిలీజ్
‘బింబిసార(Bimbisara)’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు వశిష్ఠ మల్లిడి (Vasistha Mallidi) ఈ సినిమాకు రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మరోసారి తనదైన శైలిలో కొత్త ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. విక్రమ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి, ‘నాటు నాటు’ పాటతో ఆస్కార్ గెలుచుకున్న ఎంఎం కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్నారు. చిరుకి జోడీగా త్రిష కృష్ణన్(Trisha Krishnan) నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.






