ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన ఆమెను ఆ ప్రయాణం చేయించింది.

ఈ విషయం తెలిసిన చిరంజీవి, వెంటనే రాజేశ్వరిని తన ఇంటికి ఆహ్వానించారు. ఆ క్షణాలు ఎంతో భావోద్వేగంగా మారాయి. రాజేశ్వరి చూపిన ధైర్యం, అభిమానాన్ని చూసి చిరంజీవి హృదయానికి హత్తుకున్నారు. గుర్తుగా ఆమెకు ఒక పట్టు చీర బహూకరించగా, రాజేశ్వరి చిరంజీవికి రాఖీ కట్టి ఆ అనుబంధాన్ని మరింత బలపరిచారు.

ఇంతటితో ఆగని చిరంజీవి, ఆమె కుటుంబ భవిష్యత్తుకు కూడా చేయూతనిచ్చారు. రాజేశ్వరి పిల్లల చదువులను తానే చూసుకుంటానని, వారికి మంచి భవిష్యత్తు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఉదారతతో ఆయన అభిమానుల గుండెల్లో మరింత స్థానం సంపాదించారు.

ప్రస్తుతం రాజేశ్వరి సాహసయాత్ర, చిరంజీవితో ఆత్మీయ భేటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన మెగాస్టార్ గొప్ప మనసును, అభిమానుల పట్ల ఆయనకున్న అపారమైన ప్రేమను మరోసారి చాటి చెప్పిందని అభిమానులు మురిసిపోతున్నారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

మెగా, అల్లు కుటుంబంలో విషాదం..

టాలీవుడ్ లో  మెగా(Mega), అల్లు(Allu) కుటుంబాల్లో విషాదం నెలకొంది. దివంగత నటుడు అల్లు రామలింగయ్య గారి సతీమణి(Allu Ramalingayya Wife), నిర్మాత అల్లు అరవింద్ తల్లి(Allu Aravind Mother) అల్లు కనకరత్నమ్మ(Allu Kanakarathnam) కన్నుమూశారు(Allu Kanakarathnam Passes Away). గత కొంతకాలంగా…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *