
తెలంగాణ(Telangana)లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజులు తేలికపాటి వర్షాలు(Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(IMD) అంచనా వేసింది. ఈ మేరకు మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకూ ఉపరితల ద్రోణి కొనసాగుతోందని తెలిపింది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వివరించింది. మరోవైపు పలు ప్రాంతాల్లో సాధారణం కాన్న 2,3 డిగ్రీల ఎండలు(Heat) పెరుగుతాయని పేర్కొంది. కాగా ఆదివారం నిజామాబాద్‌లో 41.5, ఆదిలాబాద్ 41.3, ఖమ్మం జిల్లాలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఐఎండీ పేర్కొంది.
ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
అటు ఏపీ(Andhra Pradesh)లో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని APSDMA తెలిపింది. దీంతో రాబోయే నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా ఆదివారం రాయలసీమ(Rayalaseema)లో 40 నుంచి 42 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.