
IPL-2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్(SRH) పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. తొలి మ్యాచులో 44 రన్స్ తేడాతో గెలిచి ఇతర జట్లకు హెచ్చరికలు పంపిన రైజర్స్.. ఆ తర్వాత తేలిపోయింది. దీంతో వరుసగా నాలుగు మ్యాచుల్లో ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఆదివారం గుజరాత్ టైటాన్స్(GT)తో హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
బ్యాటర్లు దారుణంగా విఫలం
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 20 ఓవర్లకు 152/8 స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఫించ్ హిట్టర్లు అభిషేక్ (18), హెడ్ (8) మరోసారి నిరాశపర్చారు. ఇక ఇషాన్ కిషన్ (17), నితీశ్ (31), క్లాసెన్ (27) అనికేత్ వర్మ (18), కమిన్స్(22) అనుకున్న స్థాయిలో ఆడలేకపోయారు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ 17/4 వికెట్లతో రైజర్స్‌ను దెబ్బకొట్టాడు. ప్రసిద్ధ్, సాయి కిశోర్ చెరో రెండు వికెట్లు తీశారు.
SRH vs GT IPL 2025: Gujarat Titans Triumph in Thrilling Encounter at Hyderabad
SRH 152/8 (20)
GT 153/3 (16.4)Gujarat Titans won by 7 wkts
PLAYER OF THE MATCH
Mohammed Siraj
read more https://t.co/2u4BEasdDS#SRHvGT pic.twitter.com/E7xnEcYs2k— currentnewsnexus (@currentnewsnexu) April 6, 2025
16.4 ఓవర్లలోనే 153 రన్స్ ఉఫ్..
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో టైటాన్స్‌కు షమీ షాక్ ఇచ్చాడు. 15 పరుగుల వద్ద ఇన్ ఫామ్ బ్యాటర్ సాయి సుదర్శన్‌ను (5)కే పెవిలియన్ పంపాడు. కానీ మరో ఎండ్‌లో కెప్టెన్ గిల్ (61) హాఫ్ సెంచరీతో చెలరేగగా, సుందర్ (49), రూథర్ ఫర్డ్ (35) రన్స్‌తో చెలరేగడంతో టైటాన్స్ 16.4 ఓవర్లలోనే గ్రాండ్ విక్టరీ కొట్టింది. సిరాజ్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా ఈ విజయంతో టైటాన్స్ 6 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ జట్టు తొలి స్థానంలో ఉంది.