రాజకీయాల్లో శత్రుత్వమైనా.. స్నేహమైన శాశ్వతం కాదంటారు పెద్దలు. ఇవాళ ఈ పార్టీలో ఏళ్ల తరబడి నమ్మకంగా ఉన్న వాళ్లు అకస్మాత్తుగా పార్టీ మార్చి తిట్టడం మొదలు పెట్టిన వారూ ఉన్నారు. అవతలి పార్టీలో ఉండి ఏళ్లుగా విమర్శిస్తున్న వారు సడెన్ గా ఈవైపున చేరి జై కొట్టిన వారూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఏదీ పర్మినెంట్ కాదంటారు. కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజల అభీష్టం మేరకు నడుచుకోవాలి. తాజాగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) చేసిన పని చూస్తుంటే ఈ నానుడిని బాగా ఒంటపట్టించుకున్నట్లు కనిపిస్తున్నారు.
ఏం జరిగిందంటే..?
స్వర్గీయ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Rama Rao) స్థాపించిన పార్టీ అయిన టీడీపీలో ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ ది కూడా చెరగని స్థాయి. ఆయన రాజకీయాల్లో లేకపోయినా ఆ స్థాయిని, ఆయన స్థానాన్ని ఎవరూ చెరపలేరు. అభిమానుల్లో ఆయనపై ఉన్న ప్రేమను ఎవరూ ఆపలేరు. ఎక్కడో ఓ చోట టీడీపీ మీటింగులో జూనియర్ ఎన్టీఆర్ పేరు వినిపిస్తూనే ఉంటుంది. అయితే చంద్రబాబు (Chandrababu Naidu), ఎన్టీఆర్ మధ్య అంతగా సత్సంబంధాలు లేవనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన మంత్రి నారా లోకేష్ కు ఓ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది.
నూజివీడు లో జరిగిన అశోకలేలాండ్ ప్రభోత్సవం లో కార్యకర్తల కోరిక మేరకు , ఎన్టీఆర్ అన్న ఫ్లెక్సీ చూపెడుతూ టీడీపీ కార్యకర్తలని,నందమూరి అభిమానులని ఉత్సాహపరుస్తున్న లోకేష్ అన్న.@tarak9999 @naralokesh 💥 pic.twitter.com/xae92yozNl
— CherukuriSriKrishnaChowdary® (@Cherukuri009) March 19, 2025
లోకేష్ చేతిలో తారక్ ఫ్లెక్సీ
కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో నారా లోకేష్ పాల్గొన్నారు. లోకేష్ ను స్వాగతించడానికి భారీ సంఖ్యలో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. అయితే వారిలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఫ్లెక్సీని పట్టుకుని నిల్చున్నారు. అయితే ఆ ఫ్లెక్సీని పట్టుకోమని కొందరు అభిమానులు లోకేష్ ను కోరారు. ఆయన ఎలాంటి కోపం ప్రదర్శించకుండా చిరునవ్వుతో అభిమానుల కోరిక మేరకు తారక్ ఫ్లెక్సీని పట్టుకుని అభివాదం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లోకేష్ పరిణతి చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన నాయకుడు అంటూ ప్రశంసిస్తున్నారు.






