అందాల భామల(Miss World Contestants) పాదాలు కడిగిన వీడియో(Foot washing video) ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. దీనిపై ఇటు అధికార కాంగ్రెస్(Congress), ప్రతిపక్ష BRS పార్టీల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా ప్రపంచ సుందరీమణుల పోటీలు(Miss World pageants 2025) జరుగుతున్న విషయం తెలిసిందే. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు బుధవారం వరంగల్ జిల్లా(Warangal District)లో పర్యటించారు. అలాగే ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప దేవాలయ(Ramappa Temple) సందర్శనకు వెళ్లారు. వీళ్లంతా సంప్రదాయం ప్రకారం కట్టు, బొట్టుతో కనిపించారు. గుడిలోకి వెళ్లే ముందు కాళ్లు కడుక్కునేందుకు అధికారులు కుర్చీలు, ఇత్తడి తాంబాలాలను ఏర్పాటు చేశారు.
సీఎం పూర్తిగా మతితప్పాడంటూ వ్యాఖ్యలు
తెలంగాణ ఆడ బిడ్డలు వాళ్లకు చెంబుల్లో నీళ్లు అందించారు. ఆ తర్వాత టవల్ ఇచ్చారు. ఇప్పుడు ఇదే పెద్ద వివాదంగా మారింది.
సోషల్ మీడియా(SM)లో ఈ వీడియో వైరల్‌గా మారింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా అందాల భామల కాళ్లు కడిగిస్తారా? అంటూ BRS నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీనిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కూడా స్పందించారు. కాంగ్రెస్ సీఎం పూర్తిగా మతితప్పాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Miss World 2025 contestants explored the historic 1000 Pillar Temple in Warangal, Telangana, showcasing India’s rich heritage. As someone from Telangana, I’m proud of our cultural landmarks! #MissWorld2025 #MissWorldInTelangana #Warangal #CulturalExchangepic.twitter.com/INoh9wSelJ
— Mahender Bogi (@mahbogi) May 15, 2025
BRS ఆత్మగౌరవం గురించి మాట్లాడటమా?
అలాగే మాజీ మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabita Indra Reddy) కూడా స్పందించారు. రుద్రమదేవి, సమ్మక్క సారాలక్క లాంటి వీర వనితలు పుట్టిన నేలపై తెలంగాణ ఆడబిడ్డలకు ఘోర అవమానం జరిగిందన్నారు. దీంతో BRS నేతలకు కాంగ్రెస్ పార్టీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న BRS ఆత్మగౌరవం గురించి మాట్లాడటమా? అని ప్రశ్నించారు. దీంతో అసలు అక్కడ జరిగిందేంటో తెలిపేలా కాంగ్రెస్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేశాయి.






