Samantha: రాజ్ నిడిమోరుతో సమంత డేటింగ్.. క్లారిటీ!

టాలీవుడ్ స్టార్ నటి సమంత(Samantha), డైరెక్టర్ రాజ్‌ నిడిమోరు(Director Raj Nidimoru) మధ్య ఏదో జరుగుతోందంటూ వస్తున్న వార్తలపై ఆమె మేనేజర్(Samantha’s Manager) స్పందించాడు. అవన్నీ నిరాధారమైన రూమర్సే(Baseless Rumors)నని కొట్టిపారేశాడు. సమంత నిర్మాతగా వ్యవహరించిన ‘శుభం(Shubham)’ సినిమా విజయం నేపథ్యంలో ఆ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేసిన రాజ్‌ నిడిమోరుతో కలిసి సమంత దిగిన కొన్ని ఫొటో(Photo) ఇటీవల SMలో వైరల్ అయింది. ఈ ఫొటోల ఆధారంగా వీరిద్దరిపై మరోసారి రూమర్లు ఊపందుకున్నాయి.

ఫొటో తెచ్చిన తంటా..

సమంత తన నిర్మాణంలో తొలి ప్రయత్నంగా తెరకెక్కిన ‘శుభం’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా విజయోత్సవంలో భాగంగా దర్శకుడు రాజ్‌ నిడిమోరుతో కలిసి దిగిన ఒక ఫొటోను ఆమె సోషల్ మీడియా(SM)లో పంచుకున్నారు. ఈ ఫొటో విస్తృతంగా షేర్ కావడంతో సమంత, రాజ్‌ నిడిమోరు త్వరలో కలిసి జీవించబోతున్నారంటూ కొన్ని వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి. అంతేకాదు, రాజ్‌ ఇప్పటికే తన భార్యకు విడాకులు ఇచ్చారని కూడా పేర్కొన్నాయి.

ఈ వదంతులు తీవ్రం కావడంతో సమంత మేనేజర్ స్పందించాడు. ‘‘సమంత, రాజ్‌ల గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే’’ అని ఆయన స్పష్టం చేశాడు. వారిద్దరి మధ్య కేవలం వృత్తిపరమైన స్నేహం మాత్రమే ఉందని క్లారిటీ ఇచ్చాడు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *