
వరుస గగనతల ప్రమాదాలు (Air accidents) ప్రయాణికులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత గురువారం అహ్మదాబాద్‌లో ఎయిరిండియా విమానం కూలిపోయిన(AirIndia Plane Crash) సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటనలో మొత్తం 274 మంది మరణించారు. ఈ దుర్ఘటనలో మృతులను ఇంకా గుర్తు పట్టలేదు. అటు విమానం కూలిన ప్రాంతంలో దాని శిథిలాలను ఇంకా తొలగించలేదు. ఈ పెను విషాదాన్ని మరువక ముందే ఉత్తరాఖండ్‌లో మరో గగనతల ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఉత్తరాఖండ్(Uttarakhand)లోని గౌరీకుండ్‌లో హెలికాప్టర్ కుప్పకూలింది(helicopter crashed). ఈ ఘటనలో పైలట్ సహా ఏడుగురు దుర్మరణం చెందారు.
సాంకేతిక సమస్య తలెత్తడంతో..
వివరాళ్లోకి వెళ్తే… ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు ఉత్తరాఖండ్, ఉతరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రకు చెందిన ఆరుగురు యాత్రికులతో హెలికాప్టర్ గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్(Kedharnath)కు బయలుదేరింది. ఆ సమయంలో సాంకేతిక సమస్య(Technical problem) తలెత్తడంతో పాటు వాతావరణం అనుకూలించకపోవడంతో 10 నిమిషాల్లోనే కుప్పకూలిందని అధికారులు తెలిపారు.ఈ మేరకు ఉత్తరాఖండ్ పౌర విమానయాన అభివృద్ధి అథారిటీ (UCADA) ఈ వివరాలు వెల్లడించింది.
#WATCH | उत्तराखंड के केदारनाथ के निकट गौरीकुंड क्षेत्र में एक हेलिकॉप्टर के दुर्घटनाग्रस्त होने से 7 लोगों की दुखद मृत्यु हुई है।
यह हेलिकॉप्टर केदारनाथ से गुप्तकाशी की ओर प्रस्थान कर रहा था।#Kedarnath #HelicopterCrash #Uttarakhand #gaurikund #PBSHABD pic.twitter.com/ayucGvoROM
— PB-SHABD (@PBSHABD) June 15, 2025
ఉత్తరాఖండ్ సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
హెలికాప్టర్ కుప్పకూలిందన్న్న సమాచారం అందుకున్న అధికారులు, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) బృందాలు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి(CM Pushkar Singh Dhami) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రమాద స్థలంలో సహాయక చర్యల(Assistive measures)ను మరింత వేగవంత చేయాలన్ని అధికారులను ఆదేశించారు. కాగా, మే 2న కేదార్‌నాథ్ ద్వారాలు తెరుచుకున్నప్పటి నుంచి ఇది ఐదో ప్రమాదం కావడం గమనార్హం.