బౌలింగ్‌తో నిప్పులు చెరిగే టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) బ్యాట్‌తో దంచికొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2024లో (syed mushtaq ali trophy)తన బ్యాటింగ్ విన్యాసాలతో బౌలర్లకు చుక్కలు చూపించాడు. గాయం నుంచి కోలుకున్న షమీ.. ముస్తాక్ అలీ టోర్నీలో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. సోమవారం చండీఘర్‌తో జరిగిన ప్రీ క్వార్టర్ మ్యాచ్‌లో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. పదో స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన షమీ.. అద్భుతమైన షాట్లతో అలరించాడు. 17 బంతులు ఎదుర్కొన్న షమీ.. 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. షమీ ఇన్నింగ్స్‌కు ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ (BCCI) సోషల్ మీడియాలో షేర్ చేసింది.
3 రన్స్ తేడాతో బెంగాల్ విజయం
షమీ మెరుపు ఇన్నింగ్స్ తో బెంగాల్ 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేయగలిగింది. (bengal vs chandigarh). షమీతో పాటు కరణ్ లాల్(33), ప్రదీప్త ప్రమాణిక్(30) మాత్రమే రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో జగిత్ సింగ్ 4 వికెట్లు పడగొట్టాడు. రాజ్ భా 2, నిఖిల్, అమ్రిత్, లాథర్ తలా వికెట్ తీశారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చంఢీగడ్ టీమ్ ఓపెనర్‌ను షమీ డకౌట్ చేశాడు. అయితే మరో ఓపెనర్ మనన్ ఓవ్రా (23), రాజ్ బవా (32), కీపర్ ప్రదీప్ యాదవ్ (27) రాణించడంతో మ్యాచ్ ఆసక్తిగా మారింది. చివర్లో ఆ జట్టు వికెట్లు కోల్పోవడంతో బెంగాల్ 3 రన్స్ తేడాతో గెలుపొందింది. సయాన్ ఘోష్ 4 వికెట్లతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. కనిష్క్ సేథ్‌కు 2 వికెట్లు, షమి, షాబాజ్ అహ్మద్‌కు తలో వికెట్ దక్కింది. బెంగాల్ ఇన్నింగ్ చివర్లో షమి రెచ్చిపోవడంతో మోస్తరు స్కోరు చేసిన బెంగాల్ చివరకు గెలిచింది.
ఆఖరి రెండు టెస్టులకు షమీ అందుబాటులోకి!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో (border gavaskar trophy)ఆఖరి రెండు టెస్టులకు షమీ భారత జట్టుకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. బ్రిస్బేన్ వేదికగా జరిగే మూడో టెస్టుకు ముందు షమీ జట్టుతో కలుస్తాడని వార్తలు వినిపించాయి. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఆ వార్తలను కొట్టిపారేశాడు. షమీ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని, బ్రిస్బేన్ టెస్టుకు అందుబాటులో ఉండకపోవచ్చని పేర్కొన్నాడు.
Bengal have set a target of 160 in front of Chandigarh 🎯
Mohd. Shami provides a crucial late surge with 32*(17)
Karan Lal top-scored with 33 (25)
Jagjit Singh Sandhu was the pick of the Chandigarh bowlers with 4/21#SMAT | @IDFCFIRSTBank
Scorecard ▶️ https://t.co/u42rkbUfTJ pic.twitter.com/gQ32b5V9LN
— BCCI Domestic (@BCCIdomestic) December 9, 2024








