
ఈజీగా గెలుస్తుందని భావించిన రెండు మ్యాచ్‌లను ఓడిపోయిన భారత్.. ఆశలే లేని చివరి టెస్ట్ లో సంచలన విజయం సాధించింది. ఇంగ్లండ్‌తో జరిగిన చివరిదైన ఐదో టెస్ట్ లో (IND vs ENG) 6 రన్స్ తేడాతో విజయం సాధించింది. 339/6 ఓవర్ నైట్ స్కోరుతో 35 పరుగులో లక్ష్యంతో భరిలోకి దిగిన ఇంగ్లిష్ జట్టును టీమిండియా అద్వితీయ రీతిలో కట్టడి చేసింది. ఆ జట్టును ఏ దశలోనూ కోలుకోనీయలేదు. ముఖ్యంగా హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj) బుల్లెట్స్ లాంటి బాల్స్ తో హడలెత్తించాడు. దీంతో ఇంగ్లండ్ 35 రన్స్ చేయలేక విలవిల్లాడింది. 367 రన్స్ కే ఆలౌట్ అయ్యి, 5 రన్స్ తేడాతో ఓటమి పాలైంది. దీంతో సిరీస్ 2–2తో సమమైంది.
వరుస ఓవర్లలో ఇద్దరిని బోల్డ్ చేసిన సిరాజ్
చివరిదైన ఐదో రోజు ఇంగ్లండ్ విజయానికి 35 పరుగులు అవసరం కాగా.. ఆట ప్రారంభమయ్యాక తొలి ఓవర్లోనే జేమీ ఒవర్టన్ (9) రెండు ఫోర్లు కొట్లాడు. దీంతో లక్ష్యం మరింత తగ్గింది. దీంతో భారత ప్రేక్షకుల్లో ఆందోళన మొదలైంది. అయితే, సిరాజ్ వరుస ఓవర్లలో జేమీ స్మిత్ (2), ఒవర్టన్‌ను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. కాసేపటికే జోష్ టంగ్ (0)ని ప్రసిద్ధ్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 357/9.
వారికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్
ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన క్రిస్ వోక్స్ భుజానికి కట్టుతోనే బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. మరో ఎండ్‌లో వోక్స్ ఉండగా.. సిరాజ్ బౌలింగ్‌లో అట్కిన్సన్ సిక్స్ కొట్టడంతో మ్యాచ్ మరింత ఉత్కంఠగా మారింది. మళ్లీ బంతి అందుకున్న సిరాజ్.. అట్కిన్సన్ క్లీన్‌బౌల్డ్ చేసి భారత శిబిరంలో సంబురాలు నింపాడు. ఆ బౌల్డ్ తో ఐదు వికెట్లు పూర్తి చేసుకున్నాడు. ప్రసిద్ధ్ కృష్ణ 4, ఆకాశ్ దీప్ ఒక వికెట్ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 224, ఇంగ్లాండ్ 247 పరుగులకు ఆలౌటయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ఇండియా 396 పరుగులు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 4, సెకండ్ ఇన్నింగ్స్ తో 5 వికెట్లు తీసిన సిరాజ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ (Man Of The Match) అవార్డు దక్కింది. ఈ సిరీస్ లో విశేషంగా రాణించిన భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) తోపాటు హ్యారీ బ్రూక్ కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నారు.