Kannappa Thanks Meet: ‘కన్నప్ప’ చిత్ర విజయంపై మోహన్ బాబు రియాక్షన్.. థాంక్స్ మీట్‌లో ఏమన్నారంటే..!

మంచు విష్ణు ఎంతో శ్రద్ద పెట్టి తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ‘కన్నప్ప’ చిత్రాన్ని రూపొందించారు. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద డా. ఎం. మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27న గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్ వంటి భారీ తారాగణం ఇన్వాల్వ్ అయింది. అయితే చిత్రానికి అందిన విజయం పట్ల ఆనందంగా ఉన్న కన్నప్ప టీం థాంక్స్ మీట్ నిర్వహించింది.

ఈ కార్యక్రమంలో డా. ఎం. మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘ఆ భగవంతుడు ఆశీస్సులతోనే ‘కన్నప్ప’ చిత్రానికి ఇంత గొప్ప విజయం దక్కింది. మేము సినిమాలు చేసిన టైంలో ఓ సినిమాకు ఇన్ని సభలు పెట్టేవాళ్లం కాదు. నటుడిగా 50 ఏళ్లు అవుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా అభిమానులు నా వెన్నంటే ఉండి నన్ను ముందుకు నడిపిస్తున్నారు. వారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ‘కన్నప్ప’ సక్సెస్ తరువాత వాళ్లంతా ఫోన్లు చేసి అభినందనలు తెలియజేస్తున్నారు. వారి ప్రేమకు నేను తిరిగి ఏం ఇవ్వగలను. ఈ చిత్రం కోసం అందరూ ప్రాణం పెట్టి పని చేశారు. అందరికీ హృదయ పూర్వక అభినందనలు. ఆ భగవంతుడి ఆజ్ఞతోనే ఈ సినిమాను తీశామనిపిస్తుంది. అందరి ప్రోత్సాహం ఉండబట్టే ఇక్కడి వరకు రాగలిగాం. వినయ్ లేకపోతే.. కన్నప్ప చిత్రం ఉండేది కాదు. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయ పూర్వక అభినందనలు’ అని అన్నారు.

విష్ణు మంచు మాట్లాడుతూ .. ‘మాలాంటి ఆర్టిస్టులకు ప్రేక్షకులే దేవుళ్లు. వారి ఆదరణ, ప్రేమతోనే మేం ఈ స్థాయికి వస్తాం. ‘కన్నప్ప’కు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదంతా శివలీల. ‘కన్నప్ప’ను ఇంత గొప్ప సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కు థాంక్స్’ అని అన్నారు.

ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ సినిమా మీద అందరూ ప్రేమను కురిపిస్తున్నారు. ఇంకా సినిమాను చూడాల్సినవాళ్లు చాలా మంది ఉన్నారు. అందరూ ఈ మూవీని చూడండి. మోహన్ బాబు గారు, విష్ణు గారు పదేళ్లుగా ఈ సినిమా కోసం కష్టపడుతూ వచ్చారు. ప్రతీ ఒక్కరూ ప్రాణం పెట్టి ఈ మూవీకి పని చేశారు. అందరికీ ధన్యవాదాలు’ అని అన్నారు.

అర్పిత్ రంకా మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ కోసం మూడేళ్లుగా విష్ణు, మోహన్ బాబు గారితో ప్రయాణిస్తున్నాను. వారిని ఎప్పుడూ కూడా ఇంత సంతోషంగా చూడలేదు. అక్కడే మా ‘కన్నప్ప’ ఎంత సక్సెస్ అయిందో అర్థం అవుతోంది. చాలా నెగెటివిటీని వారు ఎదుర్కొన్నారు. తిన్నడు కంటే ఎన్నో కష్టాల్ని విష్ణు పడ్డారు. మహాదేవుడు ఎన్నో కష్టాలు పెడుతుంటాడు. కానీ చివరకు ఇలాంటి విజయాన్ని అందిస్తారు. ఈ మూవీ క్లైమాక్స్ చూసి అందరూ ఏడ్చేస్తున్నారు. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. అందరూ ‘కన్నప్ప’ మూవీని చూడండి’ అని అన్నారు.

శివ బాలాజీ మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’కి వస్తున్న ప్రేమను చూస్తే నాకు మాటలు రావడం లేదు. విష్ణు గారు ఈ మూవీ కోసం చాలా కష్టపడ్డారు. ఇకపై ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. అర్జునుడు, తిన్నడు, కన్నప్పగా విష్ణు అద్భుతం చేశారు. ఈ మూవీ కోసం ప్రతీ ఒక్కరూ పగలు, రాత్రి అన్న తేడా లేకుండా పని చేశారు. ఈ సక్సెస్‌ను టీం ఎంజాయ్ చేయాలి. ఈ చిత్రంలో పని చేసిన మేం అంతా అదృష్టవంతులం. సినిమాను చూడాలన్నా అదృష్టం ఉండాలి. తల్లిదండ్రులంతా కూడా పిల్లలకు ఇలాంటి చిత్రాలను చూపించాలి’ అని అన్నారు.

 

Related Posts

Allu Kanakaratnamma: అల్లు అర్జున్ ఇంట విషాదం.. అల్లు కనకరత్నమ్మ కన్నుమూత

టాలీవుడ్‌(Tollywood)లో ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్(Allu Aravind) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి, దివంగత హాస్య నటుడు అల్లు రామలింగయ్య భార్య అల్లు కనకరత్నమ్మ (Allu Kanakaratnamma, 94) శనివారం తెల్లవారుజామున 1:45 గంటలకు…

Megastar Chiranjeevi: చిరూని కలిసి మహిళా వీరాభిమాని.. రాఖీ కట్టి తీవ్ర భావోద్వేగం 

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వీరాభిమాని రాజేశ్వరి(Rajeshwari), తన ఆరాధ్య నటుడిని కలిసేందుకు సైకిల్‌(Cycle)పై సుదీర్ఘ ప్రయాణం చేసి హైదరాబాద్(Hyderabad) చేరుకున్నారు. ఈ సంఘటన చిరంజీవిని ఆశ్చర్యంలో ముంచెత్తడమే కాక, అభిమానుల హృదయాలను కూడా కదిలించింది. రాజేశ్వరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *