అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్(Trump as US President) ప్రమాణ స్వీకారం చేసినప్పటిన నుంచి ఆయన సంచలన నిర్ణయాలు(Sensational decisions) తీసుకుంటున్నారు. ఈ నిర్ణయాలు కొంత మందికి ఉపశమనం కల్పిస్తుంటే.. మరికొందరికి తీవ్ర నష్టాన్ని మిగిల్చుతున్నాయి. ఇప్పటికే చైనా(Chaina), కెనడా(Canada) వంటి దేశాలకు సంబంధించిన ఉత్పత్తుల దిగుమతులపై భారీగా సుంకాన్ని పెంచిన ట్రంప్ ప్రభుత్వం(Trump Govt).. అక్రమ వలస దారులను వారి దేశాలకు పంపించేస్తున్నారు.ఇటీవల భారత్(India) నుంచి 20 వేల మంది అక్రమంగా వలస వచ్చినట్లు(illegal immigrant) గుర్తించిన ట్రంప్ ప్రభుత్వం వారిని ఇంటికి పంపేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది. ఈ క్రమంలోనే రెండ్రోజుల క్రితం 205 మంది భారత పౌరులను మనదేశానికి పంపించింది. ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగులు(Government employees) రాజీనామా చేశారు.
స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకుంటే..
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన ట్రంప్.. ప్రభుత్వ ఉద్యోగులను(Government employees) తగ్గించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వచ్ఛంధంగా ఉద్యోగాలకు రాజీనామా(Voluntary resignation) చేస్తే 8 నెలల జీతం ముందుగానే ఇస్తామని చెప్పింది. ఈ ఆఫర్(Offer)కు లక్షకు పైగా ఉద్యోగులు స్పందిస్తారని భావించినా.. గురువారం నాటికి కేవలం 40 వేల మంది మాత్రమే రాజీనామా చేశారు. ఈ మేరకు ఒక ఈమెయిల్ 20 లక్షల మంది ఉద్యోగులకు వెళ్లింది. స్వచ్ఛందంగా ఉద్యోగాలను వదులుకొంటే ఎనిమిది నెలల జీతం ఇస్తారని అందులో పేర్కొన్నారు.
అదే జరిగితే ఏటా 100 డాలర్లు మిగులుతాయ్!
కాగా ఫిబ్రవరి 6 వ తేదీలోపు ఓ నిర్ణయానికి రావాలని అందులో వెల్లడించారు. దీనిని ఎంచుకొన్న వారికి సెప్టెంబర్ వరకు పనిచేయకుండానే జీతం(Salary) పొందొచ్చని చెబుతున్నా, దానికి ఎలాంటి హామీ లేదని ఉద్యోగ సంఘాలు పెదవి విరుస్తున్నాయి. సుమారు 10-15 శాతం మంది దీనిని ఎంచుకోవచ్చని ట్రంప్ కార్యవర్గం భావించింది. ఇది విజయవంతంగా అమలైలతే US ప్రభుత్వ ఖర్చులు ఏటా 100 బిలియన్ డాలర్ల వరకు తగ్గవచ్చని భావిస్తున్నారు. ఓ వైపు ఫెడరల్ నిధులు(Federal funds), రుణాల(Loans)ను నిలిపివేసిన వేళ ఈ వార్త బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది.








