సునీతా విలియమ్స్‌ను త్వరగా తీసుకురండి.. మస్క్‌కు ట్రంప్‌ రిక్వెస్ట్

బోయింగ్‌ స్టార్‌లైనర్‌లో వెళ్లిన వ్యోమగాములు సునీతా విలియమ్స్ (Sunita Williams), బచ్ విల్మోర్.. గత ఎనిమిది నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వారు ఈ ఫిబ్రవరిలో భూమ్మీదకు వస్తారని ఇటీవలే నాసా (NASA) ప్రకటించన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వ్యోమగాములను తిరిగి భూమికి తీసుకొచ్చేందుకు సాయం చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తనను కోరినట్లు స్పేస్ ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) తెలిపారు.

ఏడు నెలలుగా అంతరిక్షంలోనే

2024 జూన్‌ 5న ప్రయోగించిన బోయింగ్‌ వ్యోమనౌక ‘స్టార్‌లైనర్‌ (Boeing Starliner)’లో సునీతా, బచ్ విల్మోర్ లు.. ఐఎస్‌ఎస్‌ (ISS)కు చేరుకున్నారు.  అయితే ఎనిమిది రోజుల్లో వారు తిరిగి భూమ్మీదకు రావాల్సి ఉండగా.. స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది. అప్పటి నుంచి సునీతా, బచ్ విల్మోర్ లు అంతరిక్షంలోనే ఉంటున్నారు. వారిని తిరిగి తీసుకురావడానికి నాసా(NASA) స్పేస్‌ఎక్స్‌తో కలిసి పనిచేస్తోంది.

మార్చి లేదా ఏప్రిల్ లో

అయితే వ్యోమగాములను  భూమి పైకి తీసుకు వచ్చేందుకు గత బైడెన్‌ (Biden Govt) ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదని ఎలాన్ మస్క్ తెలిపారు. వారు చేసిన ఆలస్యం వల్ల వ్యోమగాములు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని విమర్శించారు. వారిని సురక్షితంగా తీసుకు రావాలనిస్పేస్ ఎక్స్(Space X) ను అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కోరారని చెప్పారు. త్వరలో ఆ పని పూర్తి చేస్తామని మస్క్‌ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. ఇక నాసా తాజా ప్రకటన ప్రకారం.. వారు మార్చి చివర్లో లేదా ఏప్రిల్‌ తొలి వారంలో భూమిని చేరుకునే అవకాశముంది.

Related Posts

Alaska Meeting: ముగిసిన ట్రంప్-పుతిన్ భేటీ.. ఉక్రెయిన్‌తో వార్‌పై చర్చలు నిల్!

ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూసిన ఇద్దరు అగ్రనేతల భేటీ ముగిసింది. అలాస్కా(Alaska) వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump), రష్యా అధ్యక్షుడు పుతిన్‌ (Vladimir Putin) సమావేశమయ్యారు. వీరిద్దరి మధ్య దాదాపు 2.30 గంటలకు పైనే చర్చలు జరిగాయి. అయితే…

ప్రభుత్వం బంపరాఫర్.. ప్రతి బిడ్డకు ఏడాదికి రూ.45 వేలు.. ఈ ఆఫర్ మిస్ కావద్దు

ప్రపంచంలో జనాభా వేల కోట్లకు చేరుతున్న తరుణంలో, కొన్ని దేశాలు మాత్రం జనాభా తగ్గిపోతుండటంతో తల్లిదండ్రులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా చైనా(China) దేశం ఒకప్పుడు అధిక జనాభాతో వెలవెలబోయిన ఈ దేశం ఇప్పుడు పిల్లల(Child) జననం తక్కువగా ఉండటంతో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *