
భారత్, పాకిస్థాన్(IND vs PAK) మ్యాచ్ అంటే ఓ రేంజ్ ఉంటుంది. దానికి చిన్నాపెద్దా అనే తేడా అనే అభిమాని(Fans) ఉండడు. అందరూ ఒక్కటై.. అంతా చేరి భారత్ విజయాన్ని కాంక్షించమే. తాజా ఛాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy-2025)లో భాగంగా జరిగిన ఇండియా-పాక్ మ్యాచులోనూ సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులతో దుబాయ్ స్టేడియం(Dubai Stadium) మురిసిపోయింది. దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఈ మ్యాచును ప్రత్యక్షంగా చూసేందుకు స్టేడియానికి వచ్చారు.
తెలుగు రాష్ట్రాల నుంచి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), ఏపీ మంది నారా లోకేశ్(Nara Lokesh), డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
బాలీవుడ్ స్టార్లు అక్షయ్ కుమార్, ప్రీతిజింటా, రన్‌వీర్ సింగ్, సైఫ్ అలీఖాన్, ఊర్వశీ రౌతేలా హాజర్యారు. అలాగే ఐసీసీ ఛైర్మన్ జై షా కూడా వచ్చారు.
అలాగే టీమ్ఇండియా యంగ్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్(SKY), జస్ప్రీత్ బుమ్రా, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, ఇర్ఫాన్ పఠాన్ తదితరులు ఈ మ్యాచుకు హాజరై టీమ్ఇండియాను ఎంకరేజ్ చేశారు.