ManaEnadu: Noel Sean నోయల్ , రిషిత నెల్లూరు హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “బహిర్భూమి(Bahirbhoomi). ఈ చిత్రాన్ని మహకాళి ప్రొడక్షన్ బ్యానర్ పై మచ్చ వేణుమాధవ్ నిర్మిస్తున్నారు. రాంప్రసాద్ కొండూరు(Ramprasad Konduru) దర్శకత్వం వహిస్తున్నారు. బహిర్భూమి (Bahirbhoomi Movie)సినిమా అక్టోబర్ 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు.
హాష్ ట్యాగ్ “బహిర్భూమి” అని సోషల్ మీడియా పోస్టులు చేసిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి 5 వేల రూపాయల బహుమతి అందజేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది.
అప్పట్లో రెండు ఊర్ల మధ్యలో బహిర్భూమి ప్లేస్ కోసం గొడవలు జరిగేవని డైరక్టర్ రాంప్రసాద్ తెలిపారు. ఈ టైటిల్ సినిమాకు ఎందుకు పెట్టామో మూవీ చూస్తే తెలుస్తుందన్నారు. ఎలిమెంట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు..
హీరోయిన్ గరిమా సింగ్ మాట్లాడుతూ – “బహిర్భూమి” సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం 15 రోజుల షెడ్యూల్ వర్క్ చేశాను. నా క్యారెక్టర్ కు మంచి పేరొస్తుందని ఆశిస్తున్నా. “బహిర్భూమి” సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ కి థ్యాంక్స్ చెప్పారు.
వీలైనంత అందంగా మూవీని చిత్రీకరణ చేశామన్నారు టీమ్ అంతా బాగా కష్టపడ్డామని డిఓపీ వివరించారు. అలాగే ఈ సినిమాతో డైరెక్టర్ గా రాంప్రసాద్ కు మంచి పేరు రావాలన్నారు. మా టీమ్ అందరికీ “బహిర్భూమి” సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.
నటీనటులు – నోయల్, రిషిత నెల్లూరు, గరిమా సింగ్, చిత్రం శీను, విజయ రంగరాజు, జబర్దస్త్ ఫణి, జయ వాహిని ఆనంద్ భారతి, కిరణ్ సాపల,సునీల్, పెళ్లకూరు మురళీకృష్ణ రెడ్డి,తదితరులు ఉన్నారు.
టెక్నికల్ టీమ్
సినిమాటోగ్రఫీ – ప్రవీణ్ కోమరి,
మ్యూజిక్ – అజయ్ పట్నాయక్,
పీఆర్ఓ – వీరబాబు,
నిర్మాత – మచ్చ వేణుమాధవ్,
రచన దర్శకత్వం – రాంప్రసాద్ కొండూరు