ManaEnadu:‘‘కథపై నమ్మకం కలిగితేనే ప్రేక్షకులు థియేటర్లకి వెళుతున్నారు. బలమైన కథకి దీటైన వాణిజ్యాంశాల్ని మేళవించి రూపొందించిన చిత్రమే ‘క’. మా అందరికీ సినిమాపై ఉన్న నమ్మకంతోనే దీపావళికి విడుదల చేస్తున్నాం’’ అన్నారు కిరణ్ అబ్బవరం.
“క” సినిమా 70వ దశకం నేపథ్యంతో పీరియాడిక్ కథతో సాగుతుంది. కాబట్టి యూత్ తో పాటు కుటుంబ ప్రేక్షకులు, మీ ఇంట్లోని పెద్ద వాళ్లను కూడా ఆకర్షించే అంశాలుంటాయి. “క” సినిమాలో జాతర సాంగ్ కు స్పెషల్ అప్లాజ్ వస్తోంది. కథ ప్రకారం ఒక జాతర సాంగ్ ఉంటుంది. ఆ పాటను విజయ్ పొలాకీ మాస్టర్ బాగా కొరియోగ్రాఫ్ చేశారు. నాకు డ్యాన్స్ లు పెద్దగా రావు. మంచి ప్రాజెక్ట్ కు అన్నీ కుదురుతాయి అన్నట్లు డ్యాన్స్ లు కూడా ఈ పాటకు బాగా కుదిరాయి. నేను బాగా డ్యాన్స్ చేశాననే ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రంలో ఓ ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది. 15 నిమిషాల పాటు సాగే ఈ యాక్షన్ సీక్వెన్స్ కు థియేటర్ లో మంచి రెస్పాన్స్ వస్తుందని ఆశిస్తున్నాం. సినిమా రిలీజ్ కు ఇంకా రెండు వారాల పైనే సమయం ఉంది. ఈ నెల 22న ట్రైలర్ రిలీజ్ చేస్తున్నాం.
బలమైన కథకి దీటైన వాణిజ్యాంశాల్ని మేళవించి రూపొందించిన చిత్రమే ‘క’. మా అందరికీ సినిమాపై ఉన్న నమ్మకంతోనే దీపావళికి విడుదల చేస్తున్నాం’’ అన్నారు కిరణ్ అబ్బవరం. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘క’. నయన్ సారిక, తన్వీరామ్ కథానాయికలు. సుజీత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఈ నెల 31న విడుదల చేస్తున్నారు.