Veekshanam :కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో వస్తోన్న చిత్రం

ManaEnadu:చిన్న సినిమాలుగా తెరకెక్కి పెద్ద విజయం సాధించిన సినిమాలను గత కొద్ది రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం. అతి తక్కువ బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకొచ్చినా చిత్రాలు కూడా భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాయి. ఉదాహరణకు దసరా, బలగం.. రీసెంట్‌గా తెరకెక్కిన కమిటీ కుర్రాళ్లు ఇలా ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి థియేటర్లలో పెద్ద సినిమాలతో సమానంగా ఆడుతున్నాయి. అయితే ఇదే తరహాలో ఓ సూపర్ హిట్ సినిమా రాబోతుంది. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో తెరకెక్కుతోన్న వీక్షణం (Veekshanam) మూవీ అక్టోబరు 18 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవ్వనుంది.

దర్శకుడు మనోజ్ పల్లేటి(Manoj Palleti) మాట్లాడారు. ఈ మూవీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానని అన్నారు. మేం ఎంతైనా చెప్తామని, ఎవరి బిడ్డ వారికి ముద్దుగానే ఉంటుందని పేర్కొన్నారు. కాగా థియేటర్లలో మీరు వీక్షణం చూసి ఎలా ఉందో చెబితే మాకు హ్యాపీగా అనిపిస్తుందని దర్శకుడు మనోజ్ పల్లేటి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పుకొచ్చాడు.

నటుడు షైనింగ్ ఫణి మాట్లాడుతూ – వీక్షణం సినిమాలో నేను హీరోకు ఫ్రెండ్ రోల్ లో నటించాను. చాలా మంచి రోల్ తో మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంది. మేము ఈ మూవీలో నటిస్తున్నప్పుడు ఒక వెకేషన్ కు వెళ్లిన ఫీల్ కలిగింది. ఎక్కడా మూవీ చేస్తున్నామని అనిపించలేదు.

హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ – మా సినిమా మిస్టరీ థ్రిల్లర్ జానర్ లో సరికొత్తగా ఉంటూ ఆకట్టుకుంటుంది. మనం రకరకాల జానర్ మూవీస్ ఇష్టపడుతుంటాం. కానీ థ్రిల్లర్ మూవీస్ అంటే అందరికీ ఇష్టమే. అలా మీ అందరికీ నచ్చే మంచి థ్రిల్లర్ మూవీ వీక్షణం. ఈ సినిమాకు పనిచేసి ప్రతి డిపార్ట్ మెంట్, ప్రతి టీమ్ మెంబర్ ఎంతో ప్యాషన్ తో వర్క్ చేశారు.

Related Posts

Mahesh Babu | వారణాసి ఈవెంట్‌లో రాజమౌళి స్ట‌న్నింగ్ కామెంట్స్

Mahesh Babu | సూపర్ స్టార్ మహేశ్‌బాబు—దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ “వారణాసి” పై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్‌లో విడుదలైన స్పెషల్ వీడియోకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *