Mana Enadu: హీరో గోపీచంద్(Gopichand), కావ్యా థాపర్(Kavya Thapar) జోడీగా డైనమిక్ డైరెక్టర్ శ్రీను వైట్ల( Director Sreenu Vaitla) కాంబినేషన్లో వస్తోన్న మూవీ ‘విశ్వం(Viswam)’. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ దక్కింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ కాంబోలో ఈ సినిమాను నిర్మించాయి. చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించాడు. వేణు దోనేపూడి, టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 11న థియేటర్స్‌లోకి రాబోతోంది. ట్రైలర్ సైతం ఫుల్ ఎంటర్‌టైనింగ్ అంశాలతో ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లోనూ మంచి బజ్ క్రియేట్ అవుతోంది. తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre-Release Event)ను చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించింది.

చూస్తున్నంత సేపు ప్రేక్షకులు నవ్వు ఆపుకోలేరు: గోపీచంద్
ఈ సంద్భంగా హీరోగోపీ చంద్ మాట్లాడుతూ.. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వం’ చిత్రంతో హిట్ కొడుతామని ధీమా వ్యక్తం చేశాడు. శ్రీనుతో సినిమా చేయాలని ఎప్పుడో అనుకున్నా. ఆ కల రెండేళ్ల క్రితం నెరవేరిందని గోపీచంద్ చెప్పుకొచ్చాడు. ఆయన కథ చెబుతున్నంత సేపు నవ్వుతూనే ఉన్నా. సన్నివేశం బాగా పండేందుకు ఆయనే ముందుగా నటించి, చూపిస్తుంటారు. ఆయన వద్ద కంఫర్ట్ ఫీలయ్యా. ఈ సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకులు నవ్వు(Comedy) ఆపుకోలేరన్నారు. ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్ కూడా ఉంటాయని చెప్పారు. ఈ సినిమాతో శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్(Sreenu Vaitla Garu is back with a bang) అని అన్నారు. ఈ సినిమాను ఇతర టెక్నీషియన్లు కూడా అద్భుతంగా పనిచేశారని పేర్కొన్నారు.
గోపీచంద్ వల్లే అది సాధ్యమైంది: శ్రీను వైట్ల
డైరెక్టర్ శ్రీను వైట్ల మాట్లాడుతూ.. ఈ సినిమాలో కామెడీ ప్రత్యేకంగా ఉంటుంది. ‘విశ్వం’.. మంచి ప్రయాణం. బాగా ఆస్వాదించా. నేను అనుకున్నది అనుకున్నట్టు తెరకెక్కించా. గోపీచంద్(Gopichand) వల్లే అది సాధ్యమైంది. కచ్చితంగా మీ అందరినీ అలరిస్తుంది. ఒక్క సెకను కూడా బోర్ కొట్టదు. కావ్యా థాపర్ నటనతోనే కాదు డ్యాన్స్‌తోనూ ఆకట్టుకుంటుంది. ఈ మూవీ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. నేను ఏ హీరోతో పనిచేస్తే వారితో ఫ్రెండ్షిప్(Friendship) కొనసాగిస్తా’ అని శ్రీనువైట్ల తెలిపారు. మరి గోపీచంద్ ‘విశ్వం’ సినిమా దసరా(Dassera Festival) పండుగ సెలవులను ఏ స్థాయిలో క్యాష్ చేసుకుంటుందో వేచి చూడాల్సిందే.






