దేశంలోనే అత్యంత పిన్న వయస్సు ఎంపీలలో ఒకరిగా గుర్తింపు పొందారు తేజస్వి సూర్య (MP Tejasvi Surya). త్వరలోనే ఆయన తన జీవితంలో ఓ కొత్త చాప్టర్ ను మొదలుపెట్టబోతున్నారు. మరికొన్ని రోజుల్లో ఆయన ఓ ఇంటివారు కాబోతున్నారు. బెంగళూరు (Bengaluru) దక్షిణ లోక్సభ నియోజకవర్గం నుంచి రెండోసారి గెలిచిన ఆయన మార్చి 24వ తేదీన వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇంతకీ వధువు ఎవరంటే..
చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీతం, భరతనాట్య కళాకారిణి అయిన శివశ్రీ స్కంద ప్రసాద్ (Srivasree)ను ఎంపీ తేజస్వి సూర్య వివాహం చేసుకోనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ఆయనే స్వయంగా ప్రకటించారు. మార్చి 24వ తేదీన వివాహ ముహూర్తం నిర్ణయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా తమను ఆశీర్వదించాలని కోరారు. శివశ్రీ.. మద్రాస్ విశ్వవిద్యాలయం నుంచి భరతనాట్యంలో ఎంఏ, మద్రాస్ సంస్కృత కళాశాలలో సంస్కృతంలో ఎంఏ పూర్తి చేశారు. నూతన జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.







