Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి డెకాయిట్ (Dacoit). షనీల్ డియో కథను అందిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మొదటగా శ్రుతి హాసన్ ఫీమేల్ లీడ్ అనుకున్నారు. ఆమెకు సంబంధించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. కానీ అనుకోని కారణాల వల్ల ఆమె ఈ చిత్రం నుంచి తప్పుకున్నారు. తాజాగా ఆమె స్థానంలో మరో బాలీవుడ్ బ్యూటీ ఈ పాత్రను దక్కించుకుంది. ఫీమేల్ లీడ్ కు సంబంధించి ఇటీవలే మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. ఇక తాజాగా హీరోయిన్ లుక్ రివీల్ చేశారు.
అవును వదిలేసాను.. కానీ
అవును వదిలేసాను..
కానీ మనస్పూర్తిగా ప్రేమించానుHappy Birthday, @AdiviSesh ✨
Let’s kill it – #DACOIT pic.twitter.com/tH4trCr0Fe
— Mrunal Thakur (@mrunal0801) December 17, 2024
అడివి శేష్ డెకాయిట్ లో హీరోయిన్ గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ను ఫైనల్ చేశారు. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన లుక్ ను రివీల్ చేశారు. ఈ కొత్త పోస్టర్‌లో మృణాల్ ఠాకూర్ ఓ చేత్తో స్టీరింగ్ తిప్పుతూ.. మరో చేతిలో పిస్తోల్ పట్టుకొని కనిపిస్తోంది. ఇక పక్కనే ఉన్న అడివి శేష్ సిగరెట్ వెలిగిస్తుండటం ఈ పోస్టర్ లో చూడొచ్చు. ఇక ఈ పోస్టర్ ను సోషల్ మీడియాలో షేర్ చేసిన మృణాల్ ఠాకూర్.. దాని కింద.. ‘అవును వదిలేసాను.. కానీ మనస్పూర్తిగా ప్రేమించాను’.. అని రాసి ఉంది. అలాగే అడివి శేష్‌కు బర్త్ డే (Adivi Sesh Birth Day) విషెస్ తెలిపింది.
బిజీబిజీగా మృణాల్
ఇక మృణాల్ ఠాకూర్ ప్రస్తుతం బిజీబిజీగా ఉంది. ‘సీతారామం (Sitharamam)’తో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆచితూచి సినిమాలు చేస్తోంది. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో సందడి చేసింది. ప్రస్తుతం ఈ భామ చేతిలో నాలుగు హిందీ సినిమాలున్నాయి. ఇక ఇప్పుడు అడివి శేష్ ‘డెకాయిట్’ లో ఛాన్స్ కొట్టేసింది. మరోవైపు అడివి శేష్ వినయ్ కుమార్ దర్శకత్వం ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ2’ (Adivi Sesh G2 Movie)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.






