Mana Enadu: స్టాక్ మార్కెట్(Stock Markets)లలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ప్రతి సంవత్సరం నిర్వహించే స్పెషల్ సెషన్(Special Session) మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ ప్రత్యేక సెషన్ కేవలం ఒక గంట పాటు మాత్రమే నిర్వహిస్తారు. ఈ పండగ రోజు జరిగే మూరత్ ట్రేడింగ్(Muhurat Trading)కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మూరత్ ట్రేడింగ్‌లో లాభాలు అందుకోవడం శుభ సూచకంగా ఇన్వెస్టర్లు(Investors) భావిస్తుంటారు.
మార్కెట్లకు సెలవు అయినా..
మూరత్ ట్రేడింగ్ అనేది దీపావళి సందర్భంగా నిర్వహించే ఒక ప్రత్యేక సెషన్. మూరత్ వ్యాపారం 1950లో తొలుత చర్చకు రాగా 1957లో బీఎస్‌ఈ(Bombay Stock Exchange), 1992లో ఎన్‌ఎస్‌ఈ(National Stock Exchange) ప్రారంభించి సంప్రదాయంగా కొనసాగిస్తున్నాయి. అయితే ఈ ఏడాది (2024) దీపావళికి సంవత్ 2081 ప్రారంభం కానుంది. NSE, BSE సర్క్యూలర్ ప్రకారం.. ఈ సారి మూరత్ ట్రేడింగ్ నేడు అనగా నవంబర్ 1వ తేదీ శుక్రవారం నిర్వహించబోతున్నారు. ఈ రోజు శుక్రవారం మార్కెట్లకు సెలవు(Holiday) అయినప్పటికీ సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ ఉంటుంది.
కొత్త ఇన్వెస్టర్లకు స్పెషల్
కాగా ఈ ట్రేడింగ్(Trading)లో ఇప్పటి వరకు పెట్టుబడులు పెడుతున్న వారితో పాటు కొత్త పెట్టాలనుకునే వారికి చాలా ప్రత్యేకమైనది. తెలివిగా పెడితే దీర్ఘకాలం పాటు లాభాలు పొందవచ్చని మార్కెట్ నిపుణులు(Market experts) చెబుతున్నారు. కంపెనీ షేర్లు అందుబాటు ధరలోకి వచ్చిన వెంటనే కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తే లాభాలు పొందవచ్చు. ఈ ట్రేడింగ్‌లో స్టాక్స్(stocs)పై ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు.








