Mana Enadu: ఆన్లైన్ పేమెంట్స్(online payments) చేసేవారికి మరో శుభవార్త. ఇప్పటికే టెలికాం సేవల్లో దూసుకుపోతున్న జియో(Jio).. త్వరలోనే డిజిటల్ పేమెంట్స్ రంగంలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మేరకు ఆన్‌లైన్ పేమెంట్స్ అగ్రిగేటర్(online payment aggregator)గా పనిచేయడానికి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో భాగమైన జియో పేమెంట్ సొల్యూషన్స్‌కు RBI అనుమతి ఇచ్చింది. ఫలితంగా వ్యాపారులు, వినియోగదారు (Traders and consumers)ల మధ్య డిజిటల్ పేమెంట్స్ నిర్వహించడానికి జియోకు లైన్ క్లియర్ అయింది. దీంతో ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం(Phone Pay, Google Pay, Paytm) తరహాలోనే త్వరలో జియో పేమెంట్స్(Jio Payments) అందుబాటులోకి రానుంది. దీనివల్ల ఆయా యాప్స్(Apps)కు గట్టి పోటీ తప్పదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఇకపై డిజిటల్ లావాదేవీలు
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ (JFS)లో భాగమైన జియో పేమెంట్ సొల్యూషన్స్ అక్టోబర్ 28, 2024 నుంచి ఆన్లైన్ పేమెంట్ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నుంచి రెగ్యులేటరీ అనుమతి పొందింది. పేటీఎం వంటి ప్లాట్‌ఫామ్‌ల మాదిరిగానే పేమెంట్ సేవల రంగంలో పోటీదారుగా నిలుస్తూ వ్యాపారులు, వినియోగదారుల మధ్య డిజిటల్ లావాదేవీలను నిర్వహించడానికి జియో పేమెంట్స్‌ను ఈ ఆథరైజేషన్ అనుమతిస్తుంది.
బయోమెట్రిక్ యాక్సెస్‌తో
ఆన్ లైన్ పేమెంట్ అగ్రిగేటర్ గా జియో పేమెంట్స్ (Jio Payments) డెబిట్, క్రెడిట్ కార్డులు(Debit and credit cards), యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (UPI) లావాదేవీలు, ఇ-వాలెట్లు, ఇతర సేవలను అందిస్తుంది. బయోమెట్రిక్ యాక్సెస్‌తో డిజిటల్ పొదుపు ఖాతాలతో పాటు ఫిజికల్ డెబిట్ కార్డులను అందించే జియో పేమెంట్స్ బ్యాంక్ ద్వారా జియో(JIO) ఈ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇది ఇప్పటికే ఉన్న 1.5 మిలియన్లకు పైగా క్రియాశీల వినియోగదారుల బేస్‌కు సేవలు అందిస్తుంది.







