ఆర్థిక రాజధాని ముంబైలో అప్పట్లో జరిగిన పేలుళ్లు (Mumbai Blasts) దేశవ్యాప్తంగా అలజడి సృష్టించింది. ఈ ఘటనలో 267 మంది మృతిచెందారు. ఈ పేలుళ్ల కేసును ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ (Ujjwal Nikam) వాదించారు. నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్ అలుపెరగకుండా పోరాడారు. ఉగ్రవాది కసబ్‌కు ఉరిశిక్షపడేలా వాదనలు వినిపించారు. ఆ తర్వాత 2013 ముంబై గ్యాంగ్ రేప్ కేసు, 2016 కోపర్దీ గ్యాంగ్ రేప్ వంటి కీలక కేసులను వాదించి విజయం సాధించారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే రాజ్యసభకు ఎంపికయ్యారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాటి పేలుళ్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సంజయ్ దత్ (Sanjay Dutt) సమాచారం ఇచ్చి ఉంటే పేలుళ్లు జరిగేవే కావన్నారు.
దత్ పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే..
“మార్చి 12, 1993న ముంబైలో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందే సంజయ్ దత్ నివాసానికి ఓ వ్యాన్ వచ్చింది. అండర్‌వరల్డ్ గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబూసలేం దాన్ని తీసుకొచ్చాడు. అందులో హ్యాండ్ గ్రనేడ్లు, ఏకే 47లు, తుపాకుల వంటి ఆయుధాలున్నాయి. వ్యాన్‌లో నుంచి కొన్ని గ్రనేడ్లు, తుపాకులను సంజయ్ బయటకు తీశారు. ఒక్క ఏకే 47ను తన వద్ద ఉంచుకొని మిగతా వాటిని ఆయన తిరిగిచ్చేశారు. కానీ ఆ ఆయుధాల గురించి సంజయ దత్ సమాచారం ఇచ్చి ఉంటే.. పోలీసులు దర్యాప్తు చేసి ఉండేవారు. అప్పుడు ముంబై పేలుళ్లు జరిగేవి కావు” అని అన్నారు.
ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన నటుడు
తుపాకులపై ఆసక్తితో సంజయ్‌దత్ ఏకే 47ను తీసుకున్నప్పటికీ.. దాన్ని ఎప్పుడూ కాల్చలేదని నటుడి లాయర్ చెప్పినట్లు ఉజ్వల్ నికమ్ గుర్తుచేసుకున్నారు. అయితే, ఆ రోజే పోలీసులకు సమాచారం ఇచ్చి ఉంటే.. ఆ పేలుళ్లు ఆపే అవకాశం ఉండేదన్నారు. ఈ ఘటనలో తొలుత టాడా చట్టం కింద సంజయ్ దత్ ఉగ్రవాది అంటూ ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసులో కేసులో కోర్టు కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. కానీ, అక్రమ ఆయుధాలు కలిగిఉన్నారని దోషిగా తేలుస్తూ ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. పుణెలోని యరవాడ జైలులో ఆయన శిక్ష అనుభవించారు.
‘मैं संजय दत्त को निर्दोष मानता हूं’, राज्यसभा के लिए नामित वकील उज्जवल निकम ने मुंबई धमाके पर कही बड़ी बात#SanjayDutt #UjjwalNikam https://t.co/HGerDGiPDE
— India TV (@indiatvnews) July 15, 2025






