ఈ సీజన్ IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చెత్త ప్రదర్శన కొనసాగుతోంది. జాతీయ, అంతర్జాతీయ ప్లేయర్లతో భారీ హిట్టింగ్ సామర్థ్యం ఉన్న SRH యావరేజ్ స్కోరు చేసేందుకు కూడా ఆపసోపాలు పడుతోంది. అది కూడా సొంతగడ్డపై ఇలా చతికిలపడటం అభిమానులకు ఆగ్రహం తెప్పిస్తోంది. బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్(MI)తో జరిగిన మ్యాచులో SRH చెత్తగా ఓడింది. దీంతో ఈ సీజన్‌లో ఆరో ఓటమి నమోదు చేసి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లింష్టం చేసుకుంది. ఇక పాయింట్ల పట్టికలో టాప్-4లోకి రైజర్స్ వెళ్లాలంటే పెద్ద అద్భుతమే జరగాలి. మిగతా 6 మ్యాచుల్లో భారీ తేడాతో నెగ్గాలి. అప్పుడు కూడా ఇతర జట్ల నెట్ రన్ రేట్‌పై ఆధారపడి ఉంటుంది. ఏ ఒక్కటి ఓడినా ఇంటిదారి పట్టాల్సిందే.
రోహిత్ బ్యాక్ టు బ్యాక్ ఫిఫ్టీస్
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం(Uppal Stadium) వేదికగా జరిగిన మ్యాచ్‌లో MI అద్భుత ప్రదర్శన చేసింది. SRHపై 7 వికెట్ల తేడాతో సునాయాసంగా విజయం సాధించింది. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) బ్యాక్ టు బ్యాక్ హాఫ్ సెంచరీలతో చెలరేగగా, SKY తుఫాన్ ఇన్నింగ్స్‌తో MI గ్రాండ్ విక్టరీ కొట్టింది. సన్‌రైజర్స్ నిర్దేశించిన 144 పరుగుల లక్ష్యాన్ని ముంబై జట్టు కేవలం 15.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది.
Klaasen showed his class with a superb 74, mastering a tricky pitch. But MI chased it down in style Rohit with back-to-back fifties and SKY sealing it with a flourish! They’re back in the race, now sitting 3rd on the table #MIvsSRH pic.twitter.com/B5KRJorojT pic.twitter.com/9TEBzWWwTG pic.twitter.com/KlzPOeZg7N
— LogyWol7 (@LoganWolvey7) April 23, 2025
క్లాసెన్, అభినవ్ మినహా..
స్వల్ప లక్ష్య ఛేదనలో MIకి రోహిత్ (46 బంతుల్లో 70 పరుగులు; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఫామ్ కొనసాగించగా.. సూర్యకుమార్ యాదవ్ (19 బంతుల్లో 40 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. విల్ జాక్స్ (22) పరుగులు, రికెల్‌టన్ (11) పరుగులు చేశారు. సన్‌రైజర్స్ బౌలర్లలో ఉనద్కత్, అన్సారీ, మలింగ తలో వికెట్ పడగొట్టారు. అంతకుముందు, టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన SRH నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్లాసెన్ 71, అభినవ్ 43, అనికేత్ 12 రన్స్ మినహా మిగతా వారంతా సింగిల్ డిజిట్స్‌కే పరిమితమయ్యారు. MI బౌలర్లలో బౌల్ట్ 4, చాహర్ 2 వికెట్లు తీశారు. బుమ్రా, పాండ్య చెరో వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ముంబై టాప్-3లోకి దూసుకెళ్లింది.






