Mumbai train blasts case: ముంబై ట్రైన్ పేలుళ్ల కేసు.. బాంబే హైకోర్టు తీర్పుపై సుప్రీ స్టే

Supreme Court: ముంబై ట్రైన్ పేలుళ్ల కేసు(Mumbai train blasts case)కు సంబంధించి ఇటీవల బాంబే హైకోర్టు(Bombay High Court) సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 12 మంది నిందితులు నిర్దోషులేనని తీర్పు వెలువరిస్తూ ఇతర కేసులు ఏవీ లేకుంటే వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. దీంతో నిందితులను అధికారులు విడుదల చేశారు. హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పును మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు(Supreme Court) స్టే విధించింది. అయితే, ఇప్పటికే విడుదల చేసిన నిందితులను మళ్లీ అరెస్టు చేయాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌పై స్పందన తెలియజేయాలని 11 నిందితులకు నోటీసులు జారీ చేసింది.

2006 జులై 11న ఏం జరిగిందంటే..

2006 జులై 11న ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌(Mumbai Suburban Railway Network)లో జరిగిన ఏడు బాంబు పేలుళ్లు సంభవించాయి. ఇందులో మొత్తం 189 మంది దుర్మరణం చెందగా, మరో 800 మంది గాయపడ్డారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు 12 మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత ఆ 12 మందిని దోషులుగా నిర్ధారిస్తూ ట్రయల్ కోర్టు వారిని జైలుకు పంపించింది. బాంబులు అమర్చినట్లు తేలిన ఐదుగురికి మరణశిక్ష, మిగతా ఏడుగురికి జీవిత ఖైదు విధించింది. ఒకరు కరోనాతో మరణించారు. మిగతా నిందితులు దీనిపై హైకోర్టులో అప్పీలు చేయగా.. ఇటీవల వారందరినీ హైకోర్టు నిర్దోషులుగా తేల్చి విడుదలకు ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో పదకొండు మంది నిందితులు జైలు నుంచి విడుదలయ్యారు.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *