మాస్ మహారాజా రవితేజ(Ravi Teja) హీరోగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి(S. Gopal Reddy) దర్శకత్వం వహించిన సినిమా ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ (Na Autograph Sweet Memories)’. దాదాపు 20 ఏళ్ల క్రితం ఆగస్టు 11, 2004లో థియేటర్లలోకి సినిమా వచ్చి సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకొని కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంది. తాజాగా ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు వస్తోంది. ఈ మేరకు ఏప్రిల్ 18న రీరిలీజ్(Re release) చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.
ఈ మూవీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది..
ఈ మూవీ రీరిలీజ్ చేస్తుండటంతో మాస్ మహారాజా రవితేజ ఇన్‌స్టా(Instagram)లో స్పెషల్ స్టోరీ(Special Story)ని పోస్ట్ చేశారు. ‘నేను చేసిన సినిమాల్లో నా ఆటోగ్రాఫ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇది నా మదిలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈనెల 18న ఈ సినిమా మళ్లీ థియేటర్లలో విడులవుతోంది. బిగ్ స్క్రీన్(Big Screne)పై ఆ మధుర జ్ఞాపకాలను మళ్లీ గుర్తుచేసుకుంటారని ఆశిస్తున్నా’ అని రవితేజ ఇన్‌స్టా స్టోరీలో మెన్షన్ చేశారు.
కాగా ఈ మూవీలో రవితేజ సరసన గోపిక(Gopika), భూమిక చావ్లా(Bhoonika Chawla), మల్లిక(Mallika) నటించగా… ప్రకాష్ రాజ్(Prakash Raj) ఓ కీలక పాత్ర చేశారు. బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు MM కీరవాణి సంగీతం అందించారు. ఇందులో పాటలకు ఇప్పటికీ ప్రేక్షకుల్లో క్రేజ్ ఉంది. రవితేజ కెరీర్‌లో మోస్ట్ అండర్ రేటెడ్‌గా నిలిచిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Naa Autograph Sweet memories
Re-Releae Trailer out now
Re-Release on April 18th in Theatres #NaaAutograph @RaviTeja_offl #bhumikachawla @suniltollywood #venumadav@srinu10477 @JominJo18409369 pic.twitter.com/dZeuNZ4MgB— Raja Shree Harsha (@SingleRaja2628) April 8, 2025






