
ఆస్పత్రిలో రోగుల(Patients) పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన సిబ్బంది.. అమానుషంగా ప్రవర్తించారు. ICUలో చికిత్స పొందుతున్న ఓ ఎయిర్ హోస్టెస్(Air hostess)పై ఓ ప్రైవేటు ఆస్పత్రి సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇంతకీ ఏమైందంటే.. ఢిల్లీలోని గురుగ్రామ్(Gurugram)కి చెందిన ఓ మహిళ (46) ఇటీవల ఓ హోటల్‌లోని స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొట్టిన తర్వాత అస్వస్థతకు గురై ఆస్పత్రి పాలైంది. దీంతో ఆమెకు ఐసీయూలో చికిత్స అందించారు. ఈ క్రమంలో అక్కడ పనిచేసే సిబ్బందిలో ఒకరు ఆమె అత్యాచారాని(sexually assaulted)కి పాల్పడిన తర్వాత పరారయ్యాడు.
నిందితుడి కోసం పోలీసుల గాలింపు
దీనిపై ఆ మహిళ డిశ్చార్జి(Discharge) అయ్యాక తన భర్తకు విషయం చెప్పి.. గురుగ్రామ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ‘తన ఫిర్యాదులో నేను ICUలో చికిత్స పొందుతున్నప్పుడు ఆసుపత్రి సిబ్బంది నాపై లైంగిక దాడికి పాల్పడ్డారని’ పేర్కొంది. ఈ మేరకు బాధితురాలి వాగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు సమర్పించారు. దీంతో మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆసుపత్రి CCTV రికార్డులను పరిశీలిస్తున్నారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని ఓ పోలీస్ అధికారి చెప్పారు. దీంతో ఈ విషయం కాస్త వైరలవడంతో ప్రాణాలు కాపాడుతారని ఆస్పత్రులకు వెళ్తే సిబ్బంది ఇలా చేయడమేంటని నెటిజన్లు మండిపడుతున్నారు.