నాగ చైతన్య-శోభిత వెడ్డింగ్.. గెస్టుల లిస్టు ఇదే?

Mana Enadu : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya), నటి శోభిత ధూళిపాళ్ల (Sobhita Dhulipala)మరికొద్ది గంటల్లో వివాహం బంధంతో ఒక్కటవ్వబోతున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు ఇప్పటికే తుది దశకు వచ్చాయి. డిసెంబరు 4వ తేదీ బుధవారం రోజున హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్‌ వేదికగా వీరి వివాహం (Chai Sobhita Wedding) రంగరంగ వైభవంగా జరగనుంది. అయితే తాజాగా ఈ వేడుకకు రానున్న అతిథుల జాబితాను అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరి ఎవరెవరు ఈ వేడుకకు వస్తున్నారంటే..?

చై-శోభిత వివాహానికి పుష్పరాజ్

బుధవారం రోజున నాగచైతన్య- శోభితా ధూళిపాళ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు అక్కినేని కుటుంబ సన్నిహిత వర్గాలు తెలిపాయి. ‘పుష్ప2’తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయిన పుష్ప రాజ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌  (Allu Arjun) తన కుటుంబంతో కలిసి ఈ వేడుకకు హాజరుకానున్నట్లు సమాచారం.

ప్రభాస్, జక్కన్న కూడా హాజరు

అలాగే పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ హీరో ప్రభాస్‌ (Prabhas), దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి (SS Rajamouli), దగ్గుబాటి కుటుంబం, మెగా ఫ్యామిలీ సహా చిత్ర పరిశ్రమకు చెందిన ముఖ్యులు ఈ వేడుకలో పాల్గొననున్నారు. వీరంతా నూతన వధూవరులను ఆశీర్వదించనున్నట్లు అక్కినేని ఫ్యామిలీ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మరోవైపు చైతన్య-శోభితల వివాహ వేడుక పూర్తి హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగనుంది. దాదాపు ఏడెనిమిది గంటల పాటు పెళ్లికి సంబంధించిన అన్ని క్రతువులు ఒకదాని తర్వాత ఒకటి నిర్వహిస్తారని సమాచారం. 

కోడలికి నాగార్జున ఖరీదైన గిఫ్టు

ఇక పెళ్లి వేడుకలో భాగంగా కాబోయే వధూవరులకు ఇటీవల మంగళ స్నానాలు చేయించారు. శోభితను పెళ్లికుమార్తెగా ముస్తాబు చేసి మంగళ హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు (Sobhita Wedding Photos) నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫొటోల్లో శోభిత సంప్రదాయ చీర కట్టులో మెరిసిపోతూ సిగ్గులొలికింది. శోభిత తన పెళ్లి దుస్తుల కోసం, శోభిత తల్లితో కలిసి స్వయంగా షాపింగ్‌ చేశారట. ఇంటికి రాబోయే కోడలికి నాగార్జున రూ.2 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన టయోటా లెక్సస్‌ వాహనాన్ని బహుమతి(Nagarjuna Gift To Sobhita)గా ఇవ్వనున్నట్లు సమాచారం.

Related Posts

Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ.. ప్రభుత్వం సంచలన నిర్ణయం

కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) నిర్మాణంలో అక్రమాలు జరిగాయని ఆరోపించిన కాంగ్రెస్ సర్కార్(Congress Govt).. అందుకోసం జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై కమిషన్ దాదాపు 650 పేజీలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.…

ఆదోని నుంచి సైకిల్‌పై వచ్చిన అభిమానికి మెగాస్టార్ ఇచ్చిన అద్భుతమైన గిఫ్ట్! వీడియో వైరల్..

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) పట్ల అభిమానులు చూపించే ప్రేమ మరోసారి బయటపడింది. ఆదోని(Adoni) నుంచి హైదరాబాద్(Hyderadad) వరకు సైకిల్‌పై ఒంటరిగా ప్రయాణించి వచ్చిన మహిళా అభిమాని రాజేశ్వరి(Rajeshwari) అందరినీ కదిలించింది. ఎన్ని కష్టాలు, అడ్డంకులు ఎదురైనా తన ఆరాధ్య నటుడిని చూడాలన్న తపన…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *