టాలీవుడ్(Tollywood) హీరో అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya), మోడల్, నటి శోభితా ధూళిపాళ (Sobhita Dhulipala) గతేడాది చివర్లో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక మ్యారేజ్(Marriage) తర్వాత కూడా ఈ కపుల్ చాలా మూవీ(Movies)లు, వెబ్ సిరీస్(Web Series)లు చేస్తూ బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే వర్క్ లైఫ్(Work Life), పర్సనల్ లైఫ్(Peronnel Life) బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అయితే తమ వివాహ బంధం గురించి చైతూ తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. శోభితతో తన లైఫ్ సంతోషంగా సాగుతోందన్నారు.

అనుబంధాన్ని పెంచుకోవడం కోసం కొన్ని రూల్స్ పాటిస్తాం
చైతూ ఇంకేమన్నారంటే.. వారం మొత్తం వర్క్‌లైఫ్‌లో బిజీగా ఉన్నప్పటికీ.. వారాంతం(Weekends)లో మాత్రం వ్యక్తిగత జీవితానికే టైమ్ స్పెండ్ చేస్తామని చెప్పారు. ఒక విషయంలో మాత్రం కచ్చితమైన నియమాన్ని పాటిస్తామని తెలిపారు.‘‘వర్క్ లైఫ్ కారణంగా మేమిద్దరం కలిసి టైమ్ స్పెండ్ చేయడానికి అంతగా వీలుపడదు. క్వాలిటీ టైమ్‌ను స్పెండ్ చేయడానికి, అనుబంధాన్ని పెంచుకోవడం కోసం మేమిద్దరం కొన్ని రూల్స్(Rules) పాటిస్తాం. ముఖ్యంగా మేమిద్దరం హైదరాబాద్(Hyderabad)లోనే ఉంటే తప్పకుండా ఉదయం, రాత్రి సమయాల్లో కలిసే భోజనం చేయాలని నిర్ణయించుకున్నాం’ అని నాగచైతన్య చెప్పాడు.

డైరెక్టర్ రాజమౌళి అంటే నాకెంతో అభిమానం
అలాగే ‘వీకెండ్స్‌లో మాకు నచ్చిన విధంగా ఉంటాం. మూవీ నైట్, షికారుకు వెళ్లడం, నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, లేదా కుక్ చేసుకోవడం.. ఇలా ఆ క్షణాలను ప్రత్యేకంగా, మధురజ్ఞాపకంగా మార్చుకుంటాం. తనకు పుస్తకాలు చదవడం అంటే ఇష్టం. నాకు రేసింగ్‌పై ఆసక్తి. ఇద్దరం కలిసి హాలిడే ప్లాన్స్ వేస్తాం. ఇటీవల తనకు రేస్‌ట్రాక్‌పై డ్రైవింగ్ నేర్పించా. తను ఎంతో సంతోషించింది. ఎంజాయ్ చేసింది’’ అని అన్నారు. తనకు నచ్చిన రియల్ లైఫ్ హీరోల గురించీ ఆయన మాట్లాడారు. రతన్‌టాటాను తాను అభిమానిస్తుంటానని చెప్పారు. తెలుగు చిత్ర పరిశ్రమకు వచ్చేసరికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి అంటే నాకెంతో అభిమానం’’ అని చైతన్య తెలిపారు.







